Bharat Taxi App : ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఓలా, ఉబర్, రాపిడోలకు పోటీగా ‘భారత్ టాక్సీ’ యాప్.. ఇలా బుక్ చేసుకోండి!

Bharat Taxi App : ఓలా, ఉబర్ వంటి ప్లాట్‌ఫామ్‌లపై తరచుగా ఛార్జీల పెంపు ఎదుర్కొంటున్న ప్రయాణీకులకు ఈ యాప్ బిగ్ రిలీఫ్ అందిస్తుందని భావిస్తున్నారు.

Bharat Taxi App : ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఓలా, ఉబర్, రాపిడోలకు పోటీగా ‘భారత్ టాక్సీ’ యాప్.. ఇలా బుక్ చేసుకోండి!

Bharat Taxi App

Updated On : December 17, 2025 / 2:51 PM IST

Bharat Taxi App : ప్రయాణికులు, వేలాది మంది టాక్సీ డ్రైవర్లకు భారీ గుడ్ న్యూస్.. 2026 జనవరి 1 నుంచి ‘భారత్ టాక్సీ’ అనే కొత్త సర్వీసు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ భారత్ టాక్సీ సర్వీసు ద్వారా రైడర్లకు డబ్బు ఆదా, క్యాబ్ డ్రైవర్లు భారీగా సంపాదించుకోవచ్చు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలోని రైడర్లకు మాత్రమే ఈ సర్వీసు అందుబాటులోకి రానుంది.

సాధారణ ప్రజలకు సరసమైన ధరలో బుకింగ్ చేసుకోవడమే కాకుండా క్యాబ్ డ్రైవర్లకు కూడా ప్రయోజనం కలుగుతుంది. భారత్ టాక్సీ అనే టాక్సీ సర్వీసుతో ఒక వైపు, ప్రభుత్వ ఈ సర్వీసు ప్రయాణీకులకు కొత్త చౌకైన ఆప్షన్ కూడా అందిస్తుంది. మరోవైపు, ఓలా, ఉబర్, రాపిడో వంటి ప్రైవేట్ టాక్సీ అగ్రిగేటర్ కంపెనీలకు పెద్ద సవాలుగా మారనుంది.

రైడ్ బుకింగ్ ఎప్పుటినుంచంటే? :

కొత్త సంవత్సరం జనవరి 1, 2026 నుంచి మీ ఫోన్‌లో భారత్ టాక్సీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా రైడ్‌లను సులభంగా బుక్ చేసుకోగలరు. దేశంలోని అతిపెద్ద మెట్రో నగరాల్లో రవాణాను సౌకర్యవంతంగా సరసమైన ధరకు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఢిల్లీ తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈ టాక్సీ సర్వీసు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో కూడా సాధారణ ప్రజల అందుబాటులోకి రానుంది. దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో నివసించే ప్రజలు త్వరలో భారత్ టాక్సీ సర్వీసును వినియోగించుకోవచ్చు.

డ్రైవర్లకు భారీ మొత్తంలో ఆదాయం :

ఇతర ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే సరసమైన రైడ్‌లను అందించేడమే లక్ష్యంగా భారత్ టాక్సీ అందుబాటులోకి వస్తోంది. ఈ సర్వీసు ద్వారా రైడర్లకు డబ్బు ఆదా చేయడమే కాకుండా క్యాబ్ డ్రైవర్లకు కూడా భారీ ప్రయోజనం కలుగుతుంది. ప్రైవేట్ కంపెనీలు క్యాబ్ డ్రైవర్ల సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని కమీషన్లుగా తీసుకుంటున్న నేపథ్యంలో భారత్ టాక్సీ డ్రైవర్లకు వారి పనికి తగిన ప్రతిఫలాన్ని అందిస్తుంది.

Read Also : Samsung Galaxy S25 Plus : శాంసంగ్ లవర్స్ కొనాల్సిన ఫోన్.. గెలాక్సీ S25 ప్లస్‌పై రూ. 30వేలు తగ్గింపు.. ఇప్పుడే కొనడం బెటర్..!

డ్రైవర్లు తమ ఆదాయంలో 80 శాతానికి పైగా పొందవచ్చు. మిగిలిన 20 శాతం వారి కార్యకలాపాలకు వర్తిస్తుంది. ఢిల్లీలోనే 56వేల మందికి పైగా డ్రైవర్లు రిజిస్టర్ చేసుకున్నారు. భారత్ టాక్సీ కార్లను మాత్రమే కాకుండా ఆటోలు, బైక్‌లను కూడా అందిస్తుంది. ఈ సర్వీసుకు సంబంధించి ట్రయల్స్ ఇప్పటికే ఢిల్లీ, గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లలో ప్రారంభమయ్యాయి.

ఈ యాప్ మరో అద్భుతమైన ఫీచర్.. మెట్రో రైలు వంటి సర్వీసులతో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. వినియోగదారులు ఒకే చోట వివిధ రకాల రైడ్‌లను బుక్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం ట్రిప్‌ను ప్లాన్ చేసుకోవచ్చు. ఢిల్లీ పోలీసులతో ఈ ఒప్పందం కారణంగా రైడర్లు, డ్రైవర్లు ఇద్దరికీ పూర్తి భద్రతను అందిస్తుంది.

యాప్ డౌన్‌లోడ్ ఇలా :
ఈ భారత్ టాక్సీ యాప్ ఢిల్లీ, గుజరాత్‌లో లాంచ్‌ అయింది. బీటా వెర్షన్ ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. iOS వెర్షన్ కూడా త్వరలో రాబోతుంది. దేశంలోని మరిన్ని నగరాలకు సర్వీసు విస్తరించనుంది. సింగిల్ యూనిఫైడ్‌ ప్లాట్‌ఫామ్ ద్వారా వివిధ రకాల వాహనాలను కనెక్ట్ చేయొచ్చు.

యూజర్లకు కలిగే బెనిఫిట్స్ :
భారత్ టాక్సీ సింపుల్‌, సేఫ్‌, ట్రాన్స్‌పరెంట్‌ ట్రావెల్‌ ఎక్స్‌పీరిన్స్‌ అందిస్తుంది. యాప్ రియల్-టైమ్ వెహికల్ ట్రాకింగ్, మల్టిలాంగ్వేజెస్‌లో యాక్సెస్‌ అందిస్తుంది. 24×7 కస్టమర్ సపోర్ట్‌ కలిగి ఉంది. ధర పారదర్శకంగా ఉంటుంది. రైడర్ల, డ్రైవర్లు ఇద్దరికీ సెక్యూర్‌ ఆన్‌బోర్డింగ్‌తో క్లీన్ ఇంటర్‌ఫేస్‌ ఉంటుంది. ఈ ప్లాట్‌ఫామ్ టూవీలర్స్, ఆటో-రిక్షాలు, టాక్సీలు, ఫోర్ వీల్స్ వాహనాలను ఇంటిగ్రేట్‌ చేయనుంది.