Earthquake: ఐర్లాండ్ దేశ టోంగాలో భారీ భూకంపం…సునామీ ముప్పు లేదు

దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా సమీపంలో శుక్రవారం రాత్రి భారీభూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది....

Earthquake: ఐర్లాండ్ దేశ టోంగాలో భారీ భూకంపం…సునామీ ముప్పు లేదు

Earthquake

Earthquake: దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా సమీపంలో శుక్రవారం రాత్రి భారీభూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంప కేంద్రం టోంగాకు నైరుతి దిశలో 280 కిలోమీటర్ల దూరంలో 104 మైళ్ల లోతులో ఉంది.( Earthquake Strikes Near Island Nation Tonga)ఈ భారీ భూకంపం వల్ల అమెరికాకు ఎలాంటి సునామీ ముప్పు లేదని సునామీ హెచ్చరికల వ్యవస్థ తెలిపింది.

Cyclone Biparjoy Efect: బిపర్‌జోయ్ విపత్తుతో 22 మందికి గాయాలు, అంధకారంలో 940 గ్రామాలు

భూకంపం తర్వాత వెస్ట్ కోస్ట్, బ్రిటిష్ కొలంబియా, అలాస్కాలకు ఎలాంటి సునామీ ముప్పు లేదని శాస్త్రవేత్తలు చెప్పారు.ఈ భూకంపం వల్ల ఆస్ట్రేలియాకు ఎలాంటి సునామీ ముప్పు లేదని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ కూడా తెలిపింది.యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ మొదట ఫిజీ దీవుల్లో సంభవించిన భూకంపం తీవ్రత 7గా నివేదించింది.ఈ భారీ భూకంపం వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టంపై ఇంకా వార్తలు రాలేదు.