T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌2026కు ముందు శ్రీలంక కీల‌క నిర్ణ‌యం.. టీమ్ఇండియా మాజీ ఫీల్డింగ్ కోచ్‌తో..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026కి (T20 World Cup 2026) స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది.

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌2026కు ముందు శ్రీలంక కీల‌క నిర్ణ‌యం.. టీమ్ఇండియా మాజీ ఫీల్డింగ్ కోచ్‌తో..

Sri Lanka have appointed R Sridhar as their fielding coach Ahead of T20 World Cup 2026

Updated On : December 17, 2025 / 4:43 PM IST

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026కి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. ఫిబ్ర‌వ‌రి 7 నుంచి మార్చి 8 వ‌ర‌కు ఈ మెగాటోర్నీ జ‌ర‌గ‌నుంది. ఈ టోర్నీకి భార‌త్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వ‌నున్నాయి. కాగా.. ఈ మెగాటోర్నీలో (T20 World Cup 2026) విజేత‌గా నిలిచేందుకు శ్రీలంక కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ జ‌ట్టు ఫీల్డింగ్ కోచ్‌గా భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌ను నియ‌మించుకుంది.

ఈ విష‌యాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలియ‌జేసింది. స్వ‌దేశంలో ఇంగ్లాండ్, పాకిస్తాన్ల‌తో జ‌ర‌గ‌నున్న సిరీస్‌కు కూడా అత‌డు కోచింగ్ బృందంలో ఉంటాడ‌ని పేర్కొంది. శ్రీధ‌ర్‌తో లంక క్రికెట్ బోర్డు మూడు నెల‌ల కాలానికి ఒప్పందం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.మాజీ కెప్టెన్, దిగ్గ‌జ ఆట‌గాడు సనత్ జయసూర్య లంక జ‌ట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు.

Mangesh Yadav : ఆర్‌సీబీ కోట్లు కుమ్మ‌రించిన మంగేష్ యాదవ్ ఎవరు? అత‌డి ట్రాక్ రికార్డు ఏంటి?

కోచింగ్‌లో శ్రీధ‌ర్‌కు అపార అనుభ‌వం ఉంది. 2014 నుంచి 2021 వ‌ర‌కు అత‌డు భార‌త పురుషుల జ‌ట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్నాడు.లంక జ‌ట్టులో చేర‌డం ప‌ట్ల శ్రీధ‌ర్ సంతోషాన్ని వ్య‌క్తం చేశాడు. జ‌ట్టుతో చేరేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్న‌ట్లు వెల్ల‌డించాడు.

టీ20 ప్రపంచ కప్‌లో శ్రీలంక జట్టు ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్, జింబాబ్వేలతో కలిసి గ్రూప్ బిలో ఉంది. వారు ఫిబ్రవరి 8న కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఐర్లాండ్‌తో త‌మ తొలి మ్యాచ్ ఆడ‌నున్నారు.