మీకు తెలుసా: ఫ్రీ అన్ లిమిటెడ్ వాయీస్ కాల్స్ 24 గంటలు మాత్రమే

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) ఫ్రీ అన్ లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చని భారీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే ఇది లిమిటెడ్ పీరియడ్ వరకూ మాత్రమే. దీపావళి పండుగ సందర్భంగా ఇచ్చిన ఆఫర్ ను ఎంత మంది వినియోగించుకున్నారో.. దీపావళి పండుగ ఆదివారం అక్టోబరు 27 నుంచి, సోమవారం అక్టోబరు 28వరకూ 24గంటల పాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. 

కానీ, ఇది మొబైల్ యూజర్లకు కాదు, ల్యాండ్ లైన్ కనెక్షన్ లేదా బీఎస్ఎన్ఎల్ బ్రాండ్‌బాండ్ సేవలు వాడుకుంటున్న వారికి ఈ సదవకాశాన్ని అందిస్తుంది. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ మార్చి 2020 నాటికల్లా అంబరిల్లా కవరేజ్ ఇవ్వగలమనే ధీమా వ్యక్తం చేసింది. ఓ వైపు రిలయన్స్ జిగా ఫైబర్ పోటీకి వస్తున్నా తట్టుకుని నిలబడగలనన్న ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఈ వారం ఆరంభంలో బీఎస్ఎన్ఎల్ రూ.429, రూ.485, రూ.666లతో ప్రీపెయిడ్ కొత్త ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. 

వాటితో పాటు ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో అన్ లిమిటెడ్ కాల్స్ ఇస్తామంటూ ఆఫర్ చేసింది. దేశవ్యాప్తంగా వచ్చే నెల నాటికి 50వేల ప్రాంతాల్లో 4జీ సేవలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలిపింది. కేంద్ర మంత్రి ఆమోదంతో బీఎస్ఎన్ఎల్, ఎమ్టీఎన్ఎల్ లు విలీనం సుస్పష్టమైపోవడంతో బీఎస్ఎన్ఎల్ ఏ మేర సక్సెస్ కాగలదో చూడాలి.