బడ్డెట్ 2019లో ప్రధానమంత్రి శ్రయమోగి బంధన్ పేరుతో అసంఘటిత కార్మికులకు కొత్త పింఛన్ పథకాన్ని తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. 60 ఏళ్లు నిండినవారందరికీ నెలకు రూ.3వేలు పింఛన్ వస్తుందని తెలిపారు. నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత రూ.3వేల పింఛన్ వస్తుందని తెలిపారు. 10 కోట్ల మంది అసంఘటిత కార్మికులకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.
ఈ ఆర్థికసంవత్సరం నుంచే పథకం అమలు అవుతుందని తెలిపారు. ప్రారంభ నిధికి రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.