గోడ కూలి 8మంది కూలీలు మృతి
- venkaiahnaidu
- Published On : November 11, 2020 / 09:24 AM IST
8 Dead After Under-construction Building Wall Collapses in Jodhpur రాజస్థాన్ లో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్యాక్టరీ గోడ కూలి ఎనిమిది మంది కార్మికులు మరణించారు. జోధ్‌పూర్ లోని బస్ని పారిశ్రామిక వాడలో నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత నిర్మాణంలో ఉన్న గోడ కూలింది.
దీంతో ఎనిమిది మంది కూలీలు అక్కడిక్కడే మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరిన పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్నవారిని బయటకు తీశారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
0
కాగా,ఈ ఘటనపై సీఎం అశోక్ గహ్లోత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. కార్మికుల మరణ వార్త చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో మృతిచెందినవారి కుటుంబాలకు సీఎం తీవ్ర సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.40 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆంకాక్షించారు.
