Bullet bandi:మోహన’రాగాలవాన..‘బుల్లెట్ బండెక్కి వచ్చేత్తాపా పాట పాడింది ఈమే..

‘మోహన రాగాల జడివాన..జానపదాల నయగారా..సోషల్ మీడియాను ఊపేస్తున్న బుల్లెట్ బండి ఒరిజినల్ సాంగ్ ఎవరు పాడారంటే..

Bullet bandi song original singer : జానపదాల పాటలు. సామాన్యులకు కూడా అర్థం అయ్యే అర్థవంతమైన పల్లె పాటలు. తెలుగు రాష్ట్రాల్లో జానపదాల పాటలు కోకొల్లలుగా ఉంటాయి.జానపదాలు ఘల్లుమంటాయి. గుండెల్లో గిలిగింతలు పెడతాయి. ఓ పాట పాడిన వెంటనే జనాదరణ పొందకపోవచ్చు. కానీ దానికంటే ఓ టైమ్ వస్తుంది. అటువంటిదే ఓ పాట ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఓ వధువు పెళ్లి బారాత్ లో తన భర్త ముందు పాడిన ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. ఆమె డ్యాన్స్‌కు ఫిదా అయిన భర్త అలా చూస్తుండి నిల్చుండిపోయాడు. మరి యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తున్న బుల్లెట్ బండెక్కి వచ్చేత్తా పా ఒరిజినల్ సాంగ్ ఎవరు పాడారో తెలుసుకుందాం..

‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ అనే యూట్యూబ్‌లో హల్ చల్ చేసే పాట రచయిత లక్ష్మణ్‌ కలం నుంచి జాలువారగా..ఎస్‌కే బాజి సంగీతం అందించగా ప్రముఖ గాయని మోహన భోగరాజు గొంతునుంచి ఈ జానపద పాట జాలువారింది. ఆగస్టు ఏప్రిల్‌ 7న యూట్యూబ్‌లో విడుదలైన పాట ఇప్పటివరకు మూడు కోట్లకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకోగా ఇక లైక్‌లు లక్షల్లో.. షేర్లు, కామెంట్లు వేలల్లో వస్తున్నాయి. అచ్చమైన తెలంగాణ యాసలో ఉన్న ఈ పాట ఒక్క యూట్యూబ్‌లోనే కాదు బయట కూడా హోరెత్తిపోతోంది. ఈ క్రమంలోనే వివాహ వేడుక అనంతరం తీసిన బరాత్‌లో వధువు ఈ పాటకు డ్యాన్స్‌ చేసి అందరినీ మంత్రముగ్ధులను చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరి వైరల్ గా మారుమోగుతున్న ఈ బుల్లెట్ బండి పాట గాయని మోహనా భోగరాజు గురించి తెలుసుకోవాల్సిందే. ‘టక్‌ జగదీశ్‌’.. నాని కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా లో గాయని మోహనా భోగరాజు గానం ఆ టీజర్‌ ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకూ వినిపించే ఆమె గొంతు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. వరుస హిట్‌ సాంగ్స్‌తో టాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌గా రాణిస్తున్న మోహన.. అంత సులభంగా పేరు రాలేదు. దాని వెనుక ఆమె పట్టుదల ఉంది. ఓడిపోయానని వెనుకడు వేయకు..ఓటమి నుంచి విజయం పుడుతుంది అని పెద్దలు చెప్పిన మాట గాయని మోహన విషయంలో అక్షరాలా నిజమైంది. చిన్నప్పుడు ఎన్నో మ్యూజిక్‌ ప్రోగ్రామ్స్‌కు వెళ్లి.. సెలక్షన్స్ దశ‌లోనే వెనుదిరిగిన ఈ అందాల మధుర గాయని ఈరోజున సెస్సేషనల్ గాయనీగా మారింది.

మోహనా భోగరాజు తల్లికి సంగీతమంటే ఎంతో ఇష్టం. అమ్మపాటలు వింటూ పెరిగిన మోహనకు కూడా సంగీలం అన్నా..పాటలన్నా ప్రాణంగా మారింది. అలా చిన్నప్పుటింనుంచే చిన్నారి మోహన పాటలు పాడేది. మూడేళ్ల వయసులోనే మోహన గొంతు మోహనరాగాలు అందుకుంది.శాస్త్రీయ సంగీతంలో నేర్చుకుంది.ప్రస్తుతం మోహన ఈ రేంజ్ లో ప్రజాదరణ పొందటానికి తన కుటుంబం, భర్త సహాయ సహకారాలే కారణమో ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.పాటపై ఉన్న మక్కువతో చిన్నప్పటి నుంచే ఎక్కడ సంగీతం పోటీలు జరిగినా మోహన అక్కడ వాలిపోయేవారు. బుల్లితెరలో ప్రసారమయ్యే పలు పాటల పోటీల్లో పాల్గొన్నా..చాలాసార్లు ఆమె సెలక్షన్స్‌లోనే విఫలమయ్యేది. కానీ ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. తనపై తనకున్న నమ్మకంతో పదే పదే పోటీలకు వెళ్లేది.సంగీతం నేర్చుకుంటున్న సమయంలో ఓసారి మ్యూజిక్‌ డైరెక్టర్‌ బాలాజీ.. మోహన వాయిస్‌ విని..ఆయన సంగీత దర్శకత్వం చేసిన ‘జైశ్రీరామ్‌’లో ‘సయ్యామమాసం’ అనే పాటను ఆమెతో పాడించారు. ఈ పాట పాడిన తరువాత కూడా ఆమె పలు సినిమాలకు కోరస్ గానే పాడేవారు.

‘సయ్యామమాసం’ పాట తరువాత కూడా ఆమెకు సక్సెస్ రాలేదు. కనీసం గుర్తంపు కూడా రాలేదు.దీంతో ఆమె అవకాశాల కోసం ఎదురు చూస్తూ..కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. ఉద్యోగం చేస్తున్నా ఆమెలో సంగీతం పట్ల మక్కువ పోలేదు. పాటలు పాడాలనే తపించిపోయేవారు. అలా అవకాశం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో సంవత్సరన్నర తరువాత ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణిని కలవాలని నిర్ణయించుకుని మరో గాయని సహాయంతో మొదటిసారి కీరవాణిని కలిసి తాను రికార్డ్‌ చేసిన పాటల క్యాసెట్‌ని ఆయనకి అందించారు.

మోహన వాయిస్‌ విన్న కీరవాణి ఆమెకు ఫోన్‌ చేసి ‘బాహుబలి’ చిత్రంలో పాట పాడే సువర్ణ అవకాశాన్ని ఇచ్చారు. దాంట్లో ఆమె మత్తు మత్తుగా..పాడిన పాటే.. ‘మనో….హరి’. ఆ పాటతో మోహన భోగరాజుకు యువతలో మాంచి క్రేజ్‌ వచ్చేసింది. అలాగే ఆమెకు ఆఫర్స్‌ క్యూకట్టాయి. ‘భలే భలే మగాడివోయ్‌’ టైటిల్‌ సాంగ్‌, ‘బాహుబలి-2’లోని ‘ఓరోరి రాజా’(తమిళ వెర్షన్‌) పాటలు మోహన గొంతులోంచి జాలువారినవే.సినిమాల్లో పాటలే కాకుండా ప్రత్యేక ఆల్బమ్స్‌ కూడా మోహన చేస్తుంటారు. ఇటీవల ఆమె విడుదల చేసిన ‘బుల్లెట్‌ బండి’ పాటకు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఊరూ వాడా మారుమోగిపోతోంది.

మోహన భోగరాజు పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. బీటెక్‌ చదివిన మోహన ఎంబీఏ చేయాలనుకున్నారు. సింగర్‌గా స్థిరపడ్డాక కూడా చదువుని వదల్లేదు. ఇండస్ట్రీలోకి వచ్చాక ఎంబీఏ పూర్తి చేశారు.ఆమెకు టెక్నాలజీ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్. టెక్నాలజీ అంటే అంత ఇంట్రెస్ట్ ఉన్నాగానీ ఆమె సోషల్‌మీడియాకు కాస్త దూరంగా ఉంటారు. ‘అరవింద సమేత’లో రెడ్డమ్మ తల్లి పాటకు ప్రశంసల వర్షమే కురిసిందని చెప్పాలి.

 

.‘మగువా మగువా’ ఫిమేల్‌ వెర్షన్‌ పాడింది కూడా మోహననే. ‘సైజ్‌ జీరో’, ‘అఖిల్‌’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘ఇజం’, ‘శతమానం భవతి’, ‘జవాన్‌’, ‘భాగమతి’, ‘సవ్యసాచి’, ‘బ్లఫ్‌ మాస్టర్‌’, ‘ఎన్టీఆర్‌ బయోపిక్‌’, ‘ఓ బేబీ’, ‘వెంకీమామ’, ‘హిట్’ వంటి చిత్రాల్లో మోహన పాటలు పాడారు. మోహన భోగరాజు పాటల్లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. ఆమెపాటలాగే ఆమె ఆహ్యార్యం కూడా చాలా చూడముచ్చటగా ఉంటారు. ఆకట్టుకునే అందం ఆమెది అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ట్రెండింగ్ వార్తలు