దీపావళికి సర్కార్ ఆర్డర్ : రాత్రి 10 వరకూ మాత్రమే క్రాకర్స్ కాల్చాలి

  • Publish Date - October 23, 2019 / 10:26 AM IST

దీపావళి పండగ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. దీపావళి సందర్భంగా వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు యూపీ ప్రభుత్వం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని ఆదేశించింది. అదీకూడా పర్యావరణానికి హాని కలిగించని గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చుకోవాలని బుధవారం (23.10.2019) విడుదల చేసిన నోటిఫికేషన్‌లో తెలిపింది. 

క్రాకర్స్ విక్రయాలు చేసేందుకు  లైసెన్సు పొందిన వ్యాపారుల నుంచే ప్రజలు పటాసులు కొనాలని సూచించింది. ఈకామర్స్ వెబ్ సైట్లలో పటాసులు కొనవద్దని సర్కారు నోటిఫికేషన్ లో సూచించింది. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను పోలీసు అధికారులు అమలు చేస్తారని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలియజేసింది.

క్కువ కాలుష్యాన్ని వెదజల్లే గ్రీన్ పటాసులను కాల్చాలని సుప్రీంకోర్టు 2018 అక్టోబర్  23వతేదీన ఇచ్చిన తీర్పులో తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2019లో కూడా ఇదే నిబంధనలను ప్రజలు పాటించాలని తెలిపింది. కాగా…ఈ ఏడాది దీపావళి పండు అక్టోబర్ 27న దేశవ్యాప్తంగా ప్రజలు జరుపుకోనున్నారు.