వ్యాపారంలో వికసించిన ‘పద్మశ్రీ’లు 

  • Publish Date - January 26, 2019 / 07:41 AM IST

2018 సంవత్సరానికి పద్మశ్రీల ప్రకటన
15,700ల అప్లికేషన్స్
85మంది ఎంపిక..ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
నలుగురు వ్యాపార దిగ్గజాలకు పద్మశ్రీ అవార్డ్  

ఢిల్లీ : 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2018కి గాను 112  మందికి పద్మ అవార్డులను ప్రకటించింది.  వీటిలో మూడు పద్మ విభూషణ్, తొమ్మిది పద్మ భూషణ్, 73 పద్మ శ్రీ అవార్డులు ఉన్నాయి. పద్మ అవార్డుల కోసం ఈ ఏడాది మొత్తం 15,700 ధరఖాస్తులు అందినట్లు ప్రభుత్వం తెలిపింది. వీటిలో పలు రంగాలకు చెందిన విశిష్ట వ్యక్తులున్నారు. ఈ క్రమంలో వ్యాపారంలో అత్యంత ప్రతిభ కనబరిచినవారికి పద్మశ్రీ పురస్కారం వరించింది.

నలుగురు పారిశ్రామిక దిగ్గజాలకు పద్మ అవార్డులు ప్రకటించింది. ఇందులో ఎల్అండ్‌టీ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ ఏఎం నాయక్, సిస్కో మాజీ చైర్మన్ జాన్ చాంబర్స్, ఎండీహెచ్ స్పైసీస్‌కు చెందిన మహాశయ్ ధరంపాల్ గులాటీ, అడోబ్ చైర్మన్, సీఈవో శంతను నారాయణ్‌ ఉన్నారు.

ఎల్అండ్‌టీ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ ఏఎం నాయక్‌‌ను పద్మ విభూషణ్ వరించింది. ఈయన గుజరాత్‌లో జన్మించిన ఆయన 1965లో ఎల్‌అండ్‌‌టీలో జూనియర్‌ ఇంజినీర్‌గా చేరారు. తర్వాత 1996లో సంస్థ సీఈవో, ఎండీగా నియమితులయ్యారు. అటుపైన చైర్మన్‌గా వ్యవహరించారు. ఈయనకు 2009లోనే పద్మ భూషణ్‌ పురస్కారం దక్కింది.

 

అంతర్జాతీయ దిగ్గజ నెట్‌వర్కింగ్‌ హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ సంస్థ సిస్కో మాజీ చైర్మన్ జాన్‌ చాంబర్స్‌. ఈయనకు పద్మ భూషణ్ ప్రకటించారు. ఇండియాలో కంపెనీ అధిక మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్లు చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారు.

ఎండీహెచ్ స్పైసీస్ యజమాని మహాశయ్ ధరంపాల్ గులాటీకి పద్మ భూషణ్ వచ్చింది. మసాలా తయారీ సంస్థ ఎండీహెచ్‌‌ని గులాటీ స్థాపించారు. తర్వాత కార్యకలాపాలను విస్తరించారు. ఈయన దాదాపు 94 ఏళ్ల వయసులో (2017) అత్యధిక వేతనం అందుకున్న ఎఫ్‌ఎంసీజీ సీఈవోగా రికార్డు సృష్టించారు. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.21 కోట్ల వేతనం పొందారు.

 

అడోబ్ సిస్టమ్స్ చైర్మన్, సీఈవో శంతను నారాయణ్‌‌ని విదేశీ విభాగంలో పద్మశ్రీ వరించింది. ఈయన హైదరాబాద్‌లోనే జన్మించారు. టెక్‌ దిగ్గజం యాపిల్‌లో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత అడోబ్‌లో చేరారు. 2007లో అడోబ్‌ సిస్టమ్స్ సీఈవో పగ్గాలు చేపట్టారు.