Innova Ambulances: ఇన్నోవా కార్లను ఆక్సిజన్ ఫెసిలిటీతో అంబులెన్సులుగా మార్చిన వ్యక్తి

చాలా రాష్ట్రాల్లో హెల్త్ కేర్ సిస్టమ్ ఫెయిల్ అవడం.. ఇండియా కొవిడ్ 19 సెకండ్ వేవ్ కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇన్ఫెక్షన్ జబ్బు కారణంగా..

Businessmen Turn Five Toyota Innova Mpvs Etios Sedans Into Ambulances With Oxygen

Innova Ambulances: చాలా రాష్ట్రాల్లో హెల్త్ కేర్ సిస్టమ్ ఫెయిల్ అవడం.. ఇండియా కొవిడ్ 19 సెకండ్ వేవ్ కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇన్ఫెక్షన్ జబ్బు కారణంగా ప్రాణాలతో పోరాడుతూ హాస్పిటల్ కు వెళ్లడానికి కూడా ఆర్థిక స్థోమత సరిపోవడం లేదు. చాలా మంది హాస్పిటల్ కు తీసుకెళ్లడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ లేక, సరైన ట్రాన్స్ పోర్ట్ కుదరక ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇలాంటి సమయంలో పర్సనల్ కార్లను అంబులెన్సులుగా మార్చి పేషెంట్లకు సహాయపడే వాళ్లూ కనిపిస్తున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన ఈ బిజినెస్ మాన్ తన ఐదు ఇన్నోవా, Etiosలను అంబులెన్సులుగా మార్చేశాడు.

మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ జిల్లాలో యువ వ్యాపారవేత్త.. కొవిడ్ పేషెంట్లకు సహాయం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. క్యాబిన్ పార్టీషియన్ చేయించి డ్రైవర్ సేఫ్ గా ఉండేలా చూస్తున్నాడు. ఈ ఐదు అంబులెన్సుల్లో ఆక్సిజన్ సిలిండర్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది. హాస్పిటల్ కు వెళ్లే దారిలో ట్రీట్మెంట్ కు ఇబ్బంది ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాడు.

మహమ్మారి సమయంలో హాస్పిటల్ అంబులెన్సులు పేషెంట్లను తీసుకెళ్లేందుకు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాయనే ఇలా చేశాడట. అంతగా డెవలప్ కాని వాళ్ల ఏరియాకు అంబులెన్సులు రావాలంటే అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని ఇలా చేశాడు.

ధర కూడా తక్కువే..
ఈ అంబులెన్సులు పేషెంట్ల నుంచి ఎటువంటి ఛార్జి చేయవు. ఎందుకంటే వీటిని పేదవారి కోసం మాత్రమే వాడుతున్నారు. సర్వీస్ కాస్ట్ మాత్రమే ఇస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఐదు కార్లలో సర్వీసు అందిస్తుండగా అవసరమైతే మరిన్ని కార్లను అంబులెన్సులను రెడీ చేసేందుకు సిద్ధం అంటున్నాడు యజమాని.