మోడీకి అవ్వల సవాల్…మీ ఫ్యామిలీ ఏడు తరాల వివరాలు చెప్పగలరా

  • Publish Date - January 3, 2020 / 05:08 AM IST

ఢిల్లీలో చలి ఎముకలు కొరికేసేలా ఉంది. అంతటి చలిని కూడా లెక్క చేయకుండా ముగ్గురు అవ్వలు గత పదిహేను రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ అంశంపైనే ముగ్గురు అవ్వలు ఆస్మా ఖటూన్‌ (90), బిల్కీస్‌ (82). శార్వరి (75) ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా ఢిల్లీలోని షహీన్‌బాఘ్‌ ప్రాంతంలో గత పదిహేను రోజులుగా సీఏఏకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారు. 

ఎన్యూమరేటర్లు వచ్చి మీ పూర్తి పేర్లేంటి అని అడిగినా వారు చెప్పటంలేదు. ఎందుకంటే నిరూపించుకోవడానికి మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవని ఆ అవ్వలు అంటున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో  తమ చాలామంది వాళ్ల డాక్యుమెంట్లను పోగొట్టుకున్నామని మాలాంటివారు ఎందరో ఉన్నారనీ వాళ్లందరూ ఇప్పుడు ఎక్కడి నుంచి డాక్యుమెంట్లు తీసుకురావాలని ప్రశ్నిస్తున్నారు. తమ వద్ద డాక్యుమెంట్లు లేకపోయినా..తమకు చెందిన తొమ్మిది తరాలవారి పేర్లు చెప్పగలమనీ..దేశానికి ప్రధానిగా ఉన్న మోడీ వాళ్ల ఏడు తరాల కుటుంబ వివరాలు చెప్పగలరా అని ముగ్గురు అవ్వలలో ఒకరైన ఆస్మా ఘాటుగా ప్రశ్నించారు.

తాను తన తొమ్మిది తరాల ఫ్యామిలీ వివరాలు చెప్పగలని వారి పేర్లు తమకు కంఠతా వచ్చని స్పష్టంచేశారు.  తాము ఎందుకు నిరసన తెలుపుతున్నామో ప్రధాని నరేంద్రమోడీని అడగండి చెబుతారు అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు ఆస్మా ఖటూన్‌. ఎందుకు మీ పేర్లు చెప్పటానికి ఇష్టపడటంలేదు అని ప్రశ్నించగా..మా పేర్లు చెప్పం ‘చెబితే మీరు మా పేర్లు తీసేస్తారు.. అని కరాఖండీగా బదులిచ్చారు. ఢిల్లీలో వీరు చేసే నిరసన దేశవ్యాప్తంగా వైరల్‌ గా మారింది. 

ఈ వయస్సులో చలిలో ఇలా నిరసన చేయాల్సి వస్తుందని తాము ఎప్పుడు అనుకోలేదనీ..పౌరసత్వం చట్టం సవరణల వల్ల మాకు ఈ గతి పట్టిందనీ..అటువంటి దుస్థితిని ప్రధాని మోడీ తీసుకొచ్చారనీ అటువంటి పరిస్థితి తీసుకొచ్చిన ప్రధానికి తెలుసు తాము ఎందుకు నిరసన చేస్తున్నామో అన్నారు. 

మేము భారతీయ పౌరులమని నిరూపించుకోవాలని ప్రధాని కోరుకుంటున్నారేమో..దానికి సంబంధించి పేపర్లు చూపించి నిరూపించుకోవాలా? అని ప్రశ్నించారు.  పౌరసత్వ చట్ట సవరణను ప్రధాని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా ఈ ముగ్గురు అవ్వలు డిమాండ్ చేశారు.  
మేము ఇక్కడే (భారతదేశంలో) పుట్టాము..ఇక్కడే చనిపోవాలని అనుకుంటున్నాము..దీని కోసం మేము భారతీయ పౌరులమని నిరూపించుకునేలా పేపర్లు చూపించాలను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని ఘాటుగా సమాధానం చెప్పారు ఈ ముగ్గురు అవ్వలు.