Third Wave: సమయం లేదు.. సెకండ్ వేవ్ గురించి ముందే చెప్పిన కేంబ్రిడ్జ్ సంచలన రిపోర్ట్!

మరోసారి కరోనా విస్ఫోటనానికి భారత్‌ బలికాబోతుందా? కోట్ల మంది భారతీయులను కంగారు పెట్టేందుకు మళ్లీ రాబోతుంది ఒమిక్రాన్.

Third Wave: మరోసారి కరోనా విస్ఫోటనానికి భారత్‌ బలికాబోతుందా? కోట్ల మంది భారతీయులను కంగారు పెట్టేందుకు మళ్లీ రాబోతుంది ఒమిక్రాన్. భారత్‌ను మరోసారి కరోనా చిమ్మచికట్లోకి నెట్టడం ఖాయం కాగా.. దీనికి ఎక్కువ రోజుల సమయం కూడా మొదలైపోయింది. ఏం జరగకూడదు అని అనుకున్నమో అదే జరుగుతోంది. కేసులు వందల నుంచి వేలు.. వేలు నుంచి 10 వేలకు పెరిగిపోయాయి.

ఈ క్రమంలోనే కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనంలో మరింత కంగారు పెట్టే విషయం వెలుగులోకి వచ్చింది. భారత్‌లో సెకండ్‌వేవ్‌ను అంచనా వేసిన కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీ చెప్పింది చెప్పినట్లే జరగగా.. ఇప్పుడు మరోసారి అదే యూనివర్శిటీ ఇచ్చిన రిపోర్ట్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. భారత్‌లో మరోసారి కరోనా కరాళ నృత్యం తప్పదని, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి తీవ్రమైందని.. కొద్ది రోజుల్లోనే కేసుల గణనీయంగా పెరిగే అవకాశం ఉందని చెబుతోంది నివేదిక.

వృద్ధి రేటులో పెరుగుదల తీవ్రంగా ఉంటుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరించారు. ఒమిక్రాన్‌ వేవ్ వ్యవధి తక్కువ కాలమే ఉంటుందని, అయితే కేసుల సంఖ్య మాత్రం ఊహకు అందని విధంగా ఉంటుందని స్పష్టం చేశారు పరిశోధకులు. జనవరి మొదటి వారంలోనే కేసుల పెరుగుదల భారీగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

అయితే, రోజువారీ కేసులు ఎంత ఎక్కువగా ఉంటాయో అంచనా వేయడం మాత్రం చాలా కష్టమని అన్నారు. కరోనా వైరస్ ఇండియా ట్రాకర్‌ను అభివృద్ధి చేసిన కేంబ్రిడ్జ్ వర్సిటీ పరిశోధకులు దాని ఆధారంగా అంచనాలను రూపొందించారు. సెకండ్‌వేవ్‌ సమయంలోనూ కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీ చెప్పింది చెప్పినట్లే జరిగింది.

ఇప్పుడు కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ చెబుతున్న లెక్కల ప్రకారం.. కరోనా థర్డ్ వేవ్ డిసెంబర్ ఆఖరివారంలో మొదటివారంలో మొదలై జనవరిలో తీవ్రస్థాయిలోకి వెళ్తుందని చెబుతున్నారు. డెల్టా వేరియంట్ ప్రభావం లక్షల మందిపై ఉంటుందని కూడా కేంబ్రిడ్జ్ కూడా అప్పట్లో చెప్పింది.

దేశంలో ఇప్పటికే పరిస్థితులు ఆందోళనకరంగా ఉండగా.. వైరస్ రేటు 5 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్టు ట్రాకర్ ద్వారా గుర్తించారు. పరిణామాలు గమనిస్తే థర్డ్‌వేవ్‌కు మరో 10-15 రోజులే సమయం ఉందని అంటున్నారు. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్, డెల్టా వేరియెంట్లు కలిసి కరోనా కేసుల సునామీ సృష్టిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు