భారత్ పౌరసత్వం కోసం పెద్ద క్యూ

  • Publish Date - December 14, 2019 / 05:21 AM IST

పార్లమెంట్ లో పౌరసత్వ బిల్లు అమోదం..గవర్నర్ ఆమోద ముద్ర చకచకా జరిగిపోయాయి. దీంతో భారత్ శరణార్థులకు పౌరసత్వం ఇవ్వటానికి కావాల్సని ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ నుంచి శరణార్థులుగా భారతదేశం వచ్చిన కొంతమందికి శుక్రవారం (డిసెంబర్ 13) భారత్ పౌరసత్వానికి సంబంధించిన ఫార్మాలిటీస్ ను పూర్తిచేసింది.  

రాజస్థాన్ లోని జైసల్మేర్ లో భారత వలసవాదులకు భారత్ వచ్చినవారికి పౌరసత్వం ఇచ్చేందుకు ఓ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. భారత్ పౌరసత్వం కోసం 15మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ 15మందిలో కొందరికి భారత పౌరసత్వాన్ని ఇచ్చారు. 

ఈ సందర్భంగా సబ్ జైసల్మేర్ సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ ఓం ప్రకాశ్ బిష్ణోయ్  భారత్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నవారికి అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్  చేస్తామని తెలిపారు. అన్ని విభాగాల పనులు  ఈ శిబిరంలో పూర్తిచేస్తామని, తరువాత దరఖాస్తు దారులకు భారత పౌరసత్వం ఇస్తామని తెలిపారు.  సంబంధించిన క్లియరెన్స్..రిపోర్టింగ్ ప్రక్రియను కేంద్రం ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో పనిచేసే ఏజెన్సీలు కూడా కొన్ని వ్యవహారాలు చక్కబెడతాయని ఓం ప్రకాశ్ బిష్ణోయ్ తెలిపారు.