Central Bank Of India Jobs : సెంట్రల్ బ్యాంకులో 214 ఉద్యోగాలు… దరఖాస్తు గడువు పొడిగింపు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 214 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.
- Naveen
- Published On : December 18, 2021 / 06:17 PM IST
Central Bank Of India Jobs
Central Bank Of India Jobs : మీరు బ్యాంకులో జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? బ్యాంకులో జాబ్ కొట్టడమే మీ లక్ష్యమా? అయితే ఈ వార్త మీ కోసమే. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఉద్యోగాల భర్తీకి గతంలోనే జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం 214 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. గతంలో 115 పోస్టుల్ని ప్రకటించినా… ఇప్పుడా పోస్టుల సంఖ్యను 214 కి పెంచింది. అంతేకాదు దరఖాస్తు గడువు కూడా పొడిగించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 డిసెంబర్ 17 చివరి తేదీ అని గతంలో ప్రకటించగా.. తాజాగా దరఖాస్తు గడువుని 2021 డిసెంబర్ 30 వరకు పొడిగించింది.
Balakrishna : ‘అన్ స్టాపబుల్’ బాలయ్యతో మాస్ మహారాజ్
* దరఖాస్తు ప్రారంభం- 2021 నవంబర్ 23
* దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 30
* కాల్ లెటర్స్ డౌన్‌లోడ్- 2022 జనవరి 11
* ఆన్‌లైన్ ఎగ్జామినేషన్- 2022 జనవరి 22
* దరఖాస్తు ఫీజు- రూ.850. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.175.
* ఎంపిక విధానం- ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ.
పూర్తి వివరాలకు.. centralbankofindia.co.in వెబ్ సైట్ ను చూడాలి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి…
Best Foods : రన్నింగ్, జాగింగ్ చేసే వారికి బెస్ట్ ఫుడ్స్ ఇవే…
