Best Foods : రన్నింగ్, జాగింగ్ చేసే వారికి బెస్ట్ ఫుడ్స్ ఇవే…

వాల్ న‌ట్స్ లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబ‌ర్‌, విట‌మిన్ ఇ, ఇంకా ఇత‌ర అనేక పోష‌కాలు వాల్ న‌ట్స్‌లో ఉంటాయి.

Best Foods : రన్నింగ్, జాగింగ్ చేసే వారికి బెస్ట్ ఫుడ్స్ ఇవే…

Food

Best Foods : ఇటీవలి కాలంలో అందరిలో ఫిజికల్ ఫిట్ నెస్ పై ఆసక్తి బాగా పెరిగింది. ఈక్రమంలోనే జాగింగ్,వాకింగ్, రన్నింగ్ యోగా, ఇత‌ర వ్యాయామాల‌ను రోజూ చేస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం రన్నింగ్ చేసిన తర్వాత, శరీరంలో క్యాలరీలతో పాటు, ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. కాబట్టి, తిరిగి ఎనర్జిని పొంది, రోజంతా యాక్టివ్ గా, రిఫ్రెష్ గా ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ లో కొన్ని ఎనర్జిటిక్ ఫుడ్స్ తీసుకోవాలి.

అయితే సాధార‌ణంగా చాలా మంది ఉద‌యం ర‌న్నింగ్ చేస్తుంటారు. రోజూ ర‌న్నింగ్ చేసేవారికి ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీంతో అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గుతారు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. డ‌యాబెటిస్ త‌గ్గుతుంది. అయితే రోజూ ర‌న్నింగ్ చేసేవారు శ‌క్తి కోసం రోజూ కొన్ని ర‌కాల ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మ‌కాయ‌ల్లో విట‌మిన్ సి, కాల్షియం అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల రోజూ నిమ్మ‌ర‌సం తీసుకుంటే ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. దీన్ని రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తీసుకోవ‌చ్చు. లేదా రోజులో ఇత‌ర స‌మ‌యాల్లోనూ హెర్బ‌ల్ టీ ల‌లో క‌లిపి తీసుకోవ‌చ్చు. దీని వ‌ల్ల ఎముక‌లు ఆరోగ్యంగా ఉంటాయి.

ర‌న్నింగ్ చేసేవారు రోజూ క‌చ్చితంగా తినాల్సిన ఆహారాల్లో అర‌టి పండు ఒక‌టి. దీన్ని తింటే క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. అలాగే శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తిని అందిస్తుంది. దీంతో ర‌న్నింగ్ వ‌ల్ల అల‌సట వ‌చ్చిన వారు వెంట‌నే శ‌క్తిని పొంద‌వ‌చ్చు. అర‌టి పండ్ల‌లో విట‌మిన్ బి6 ఉంటుంది. ఇది షుగ‌ర్‌ను త‌గ్గిస్తుంది. అరటిపండ్లలో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రతి రన్నింగ్ చేసేవారితోపాటు అథ్లెట్స్ కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్నఅరటిపండ్లను తీసుకుంటారు. అరటిపండ్లలో ఉండే విటమిన్స్, మినిరల్స్ మరియు కార్బోహైడ్రేట్స్ కావల్సిన ఎనర్జీ మరియు శక్తిని అందిస్తాయి.

పండ్లు స్వీట్ , జ్యూసీగా మరియు పుష్కలమైన విటమిన్స్ ఉంటాయి. రన్నింగ్ తర్వాత ఫ్రూట్స్ తినడం అనేద ఒక గొప్ప ఆరోగ్య ప్రయోజనం. ముఖ్యంగా ఉదయం ఆరెంజ్, ఆపిల్స్, బ్లాక్ బెర్రీస్, గ్రేప్ ఫ్రూట్ వంటివి తీసుకోవాలి. వీటిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. రన్నింగ్ తర్వాత హెల్తీ వెజిటేబుల్స్ తినడం చాలా ఆరోగ్యకరం. వీటిలో యాంటీఆక్సిడెంట్స్, ప్రోటీనులు, విటమిన్స్, మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి శరీరానికి అవసరం అయ్యే బలాన్ని అందిస్తాయి. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ఆకుకూరలు, లెట్యూస్, బ్రొకోలీ, మరియు క్యారెట్స్ వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. కీరదోస, టమోటోవంటివి సాండ్విచ్ లను తీసుకోవాలి. ఉడికించిన గుడ్డును కూడా ప్రోటీన్ గా తీసుకోవాలి.

వాల్ న‌ట్స్ లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబ‌ర్‌, విట‌మిన్ ఇ, ఇంకా ఇత‌ర అనేక పోష‌కాలు వాల్ న‌ట్స్‌లో ఉంటాయి. అందువ‌ల్ల రోజూ ర‌న్నింగ్ చేసేవారు వాల్ న‌ట్స్ ను తింటే శ‌క్తితోపాటు పోష‌కాల‌ను అందుకోవ‌చ్చు. దీంతో ఎముక‌లు దృఢంగా మారుతాయి. అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు రోజూ ర‌న్నింగ్ చేశాక వాల్ న‌ట్స్ ను తింటే ఇంకా ఎక్కువ ఫ‌లితం ఉంటుంది. త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.

చెర్రీ పండ్ల‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ర‌న్నింగ్ చేసిన అనంత‌రం వ‌చ్చే నొప్పుల‌ను, వాపుల‌ను త‌గ్గిస్తాయి. క‌నుక రోజూ ర‌న్నింగ్ చేసేవారు ఎలాంటి నొప్పులు, వాపులు రాకుండా ఉండాలంటే రోజూ చెర్రీ పండ్ల‌ను ఒక క‌ప్పు మోతాదులో తినాల్సి ఉంటుంది.

చియా విత్త‌నాల్లో ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే కాల్షియం, ఐర‌న్‌, ప్రోటీన్లు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి. వీటిని రాత్రంతా నీటిలో నాన‌బెట్టి ఉద‌యం ర‌న్నింగ్ చేసిన అనంత‌రం తిన‌వ‌చ్చు. దీంతో డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండ‌వ‌చ్చు. అలాగే ఫైబ‌ర్ ల‌భిస్తుంది క‌నుక జీర్ణ స‌మస్య‌లు త‌లెత్త‌కుండా ఉంటాయి. శ‌క్తి కూడా ల‌భిస్తుంది. అదేవిధంగా ఓట్ మీల్ బాగా ఉపకరిస్తుంది. ఎందుకంటే వీటిలో ప్రోటీన్, ఫైబర్, మరియు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి . వీటిలో ఉండే ఫైబర్ పొట్ట నిండుగా ఉండేట్లు చేస్తుంది. శక్తినిస్తుంది.