LPG Price Down : గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర.. నేటి నుంచే అమల్లోకి..

LPG Price Down : కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. 19కేజీల సిలిండర్ ధరను భారీగా తగ్గించింది.

commercial lpg Price cuts

  • గ్యాస్ వినియోగదారులకు శుభవార్త
  • భారీగా తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
  • తగ్గిన ధరలు నేటి నుంచి అమల్లోకి

LPG Price Down : కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. 19కేజీల సిలిండర్ ధర రూ.183.50 తగ్గింది. ఏడాదిలో వాణిజ్య సిలిండర్ల ధరలు తగ్గడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ తాజాగా తగ్గింపుతో దేశవ్యాప్తంగా వ్యాపారాలు, హోటళ్లు, చిన్నతరహా పరిశ్రమలు నడిపే వారికి కొంత ఉపశమనం లభించినట్లయింది.

Also Read : Rythu Bharosa : రైతుభరోసా నిధులు మీబ్యాంక్ ఖాతాలో పడలేదా..? వెంటనే ఇలా చేయండి.. మీ ప్రాబ్లం క్లియర్..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్పీజీ సరఫరా మెరుగుపడుతుంది. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి పెరగడం, విదేశాల నుంచి దిగుమతి స్థాయిలు మెరుగయ్యాయి. దీంతో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

తాజాగా నిర్ణయంతో ఢిల్లీలో ఇప్పటి వరకు రూ.3,113 ఉన్న వాణిజ్య సిలిండర్ ధర ప్రస్తుతం రూ.2,930కి లభించనుంది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో దీని ధర రూ. 3,236 నుండి రూ. 3,052.50కి తగ్గింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో రూ. 3,255.50 గా ఉన్న ధర ఇప్పుడు రూ. 3,081.50కి చేరింది. ఇక హైదరాబాద్ లో రూ.3,178కు చేరగా.. విజయవాడలో రూ.3,115కు చేరింది.

సాధారణ ఇళ్లలో వంట కోసం ఉపయోగించే 14.2 కేజీల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. మరోవైపు ప్రైవేటు రంగ ఇంధన సంస్థ నయారా ఎనర్జీ కూడా పెట్రోల్‌పై లీటర్‌కు రూ.5, డీజిల్‌పై రూ.3 ధర తగ్గించింది.