Petrol and Diesel rates : కేంద్రం గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గింపు.. భారీగా తగ్గనున్న రేట్లు?

Petrol and Diesel rates : పెట్రోల్, డీజిల్ పై విధిస్తున్న అదనపు ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Petrol and Diesel Rates

  • కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
  • పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు
  • పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయా? 

Petrol and Diesel rates : వాహనదారులకు భారీ ఊరట లభించింది. ఇరాన్‌ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా వార్ నేపథ్యంలో భారత దేశంలో ఇంధన సంక్షోభం నెలకొంది. పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద వాహనదారులు క్యూలు కడుతున్నారు. పెట్రోల్, డీజిల్ కొరతతో పాటు ధరలు భారీగా పెరుగుతాయని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు భారీ శుభవార్త చెప్పింది.

Also Read : Telangana govt : తెలంగాణలో లక్షలాది మందికి ఊరట.. సాదాబైనామా రిజిస్ట్రేషన్లు.. కొత్త నిబంధనలివే..

పెట్రోల్, డీజిల్ పై విధిస్తున్న అదనపు ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పెట్రోల్ పై లీటర్ కు రూ.13 నుంచి రూ.3 వరకు తగ్గించగా.. డీజిల్ పై రూ.10 ని పూర్తిగా తొలగించింది. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరల భారాన్ని ప్రజలపైకి బదిలీ చేయకుండా ఈ చర్య కొంతమేరకు ఉపకరించవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు.

మరోవాదన ఏమిటంటే.. కేంద్ర ప్రభుత్వం అదనపు ఎక్సైజ్ సుంకం తగ్గింపు నిర్ణయం.. నేరుగా వినియోగదారుడికి ప్రయోజనం లభించడం లేదు. హార్మూజ్ జలసంధి మూసివేత భయాలు, పశ్చిమాసియా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో పెరిగిన దిగుమతి వ్యయాన్ని తట్టుకోవడానికి, చమురు సంస్థ ఆర్థిక రికవరీకి సహాయపడటానికి ఈ సుంకాల కోత ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. దేశంలో ప్రధాన ప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థ అయిన నయారా ఎనర్జీ వినియోగదారులపై ఇప్పటికే ధరల భారాన్ని మోపింది.