Birth Death Registration: జనన మరణాల నమోదులో కీలక మార్పులు.. ఇకపై పాత పద్ధతిలోనే.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

భారతదేశంలో జనన, మరణాల(Birth Death Registration) నమోదు ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకువచ్చింది.

Central Government made key changes to the birth and death registration process.

Birth Death Registration: భారతదేశంలో జనన, మరణాల నమోదు ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకువచ్చింది. పార్లమెంట్ ఆమోదించిన ‘జనన, మరణాల నమోదు చట్టం, 2026’ కు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో, అక్టోబర్ 1, 2026 నుండి నూతన నిబంధనలు అమలులోకి రానున్నాయి. సకాలంలో జనన, మరణాలను నమోదు చేయడంలో విఫలమైన వారికి ఇకపై తీవ్ర ఇబ్బందులు, చట్టపరమైన సంక్లిష్టతలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గణాంకాల శాఖ కార్యదర్శి రవికుమార్ సుర్పూర్ అధికారికంగా వెల్లడించారు.

Nokia 3210 Relaunch: కీప్యాడ్ ఫోన్లలో ఇది హైలెట్.. రూ.4,299 కే నోకియా 3210 4Gతో.. సూపర్ ఫీచర్లు, పవర్‌ఫుల్ బ్యాటరీ

ఏడాది దాటితే మేజిస్ట్రేట్ తనిఖీ – పరిశీలన అనంతరమే అనుమతి:

కొత్త నిబంధనల ప్రకారం, జననం (Birth Death Registration)లేదా మరణం సంభవించి ఏడాది పూర్తయి, రెండేళ్ల లోపు ఆలస్యమైన కేసులలో క్షేత్రస్థాయి విచారణ మరింత కఠినతరం కానుంది. ఈ విధమైన దరఖాస్తులను మేజిస్ట్రేట్ స్థాయిలో కూలంకషంగా పరిశీలిస్తారు. సంఘటన యొక్క ప్రామాణికత, సమర్పించిన పత్రాల చెల్లుబాటును క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత, నిర్ణీత రుసుము చెల్లించిన పిమ్మట మాత్రమే నమోదుకు అనుమతి ఇస్తారు.

రెండేళ్లు దాటితే కోర్టు అనుమతి తప్పనిసరి – తొలి తరగతి మేజిస్ట్రేట్ ఉత్తర్వులు;

ఒకవేళ జనన లేదా మరణ నమోదులో రెండేళ్లకు పైగా ఆలస్యం జరిగితే, ప్రక్రియ మరింత సంక్లిష్టంగా మారనుంది. ఇటువంటి కేసుల్లో కేవలం ఫస్ట్ క్లాస్ జుడీషియల్ మేజిస్ట్రేట్ ఇచ్చే కోర్టు ఆదేశాల ఆధారంగా మాత్రమే నమోదుకు అనుమతి లభిస్తుంది. అక్టోబర్ 1 నాటికి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేశారు.

పారదర్శకత, ఖచ్చితత్వమే లక్ష్యం – కేంద్ర ప్రభుత్వం స్పష్టత:

దీర్ఘకాలిక ఆలస్యం తర్వాత దాఖలయ్యే దరఖాస్తుల్లో నకిలీ పత్రాలను అరికట్టడం, డేటాలో పారదర్శకతను పెంచడమే ఈ చట్ట సవరణ ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. ప్రతి రికార్డు అత్యంత ఖచ్చితంగా, ప్రామాణికంగా ఉండేలా చూడటానికి ఈ బహుళ స్థాయి తనిఖీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.