Crude oil: పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం సంచలన నిర్ణయం?
పెట్రోల్, డీజిల్(Crude oil) ధరలపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
- V Santhosh Kumar
- Published On : March 3, 2026 / 06:44 PM IST
Central government sensational on petrol and diesel prices
Crude oil: మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందనే ట్రేడ్ వర్గాలు వేస్తున్న భారత ప్రభుత్వం ఈ విషయంపై కీలక ప్రకటన చేసింది. భారతదేశంలో ప్రస్తుతం ముడి చమురు(Crude oil), శుద్ధి చేసిన ఇంధన నిల్వలు దాదాపు 25 రోజుల పాటు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో, మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు పెరుగుతున్నందున, ముడి చమురు, LPG, LNG దిగుమతి చేసుకోవడానికి ప్రత్యామ్నాయ దేశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా అధికారులు తెలిపారు. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే పెంచే ఆలోచన లేనట్టుగా కూడా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగనున్నాయి అన్న వార్తలకు చెక్ పడింది.
War: చరిత్రలో ఇప్పటివరకు యుద్ధం చేయని ఈ ఐదు దేశాల గురించి మీకు తెలుసా?
