Ration Card Update: రేషన్ కార్డుదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఆ పని చేయకపోతే కార్డు బ్లాక్.. వెంటనే ఇలా చేయండి!
దేశంలోని ఉచిత రేషన్(Ration Card Update) లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ ఇచ్చింది.
- V Santhosh Kumar
- Published on- October 3, 2026 / 03:45 PM IST
Central Government set to deactivate ration card if KYC is not completed.
Ration Card Update: దేశంలోని ఉచిత రేషన్ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ ఇచ్చింది. రేషన్ కార్డు ఉండి కూడా గత ఆరు నెలలుగా నిత్యావసర సరుకులు తీసుకోని వారి కార్డులను తాత్కాలికంగా నిలిపివేసేందుకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ సిద్ధమవుతోంది. సరుకులు తీసుకోని లబ్ధిదారుల కోటా పక్కదారి పడుతూ, బియ్యం అక్రమ మార్కెట్‌కు తరలుతుండటంతో ఈ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా దాదాపు 1.58 కోట్ల రేషన్ కార్డులను ఈ అక్టోబర్ నెల నుంచే నిలిపివేయనున్నట్లు సమాచారం.
డూప్లికేట్, నకిలీ కార్డుల ప్రక్షాళన.. 3 నెలల ప్రత్యేక గడువు:
ఈ నిర్ణయం ద్వారా బోగస్ లబ్ధిదారులు, మరణించిన వ్యక్తులు, డూప్లికేట్ కార్డులను(Ration Card Update) డేటాబేస్ నుంచి పూర్తిగా తొలగించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, కార్డులు ఇనాక్టివ్ అయినప్పటికీ పేర్లను వెంటనే తొలగించకుండా, లబ్ధిదారులకు మూడు నెలల పాటు సమయం ఇస్తారు. ఈ గడువులోగా అర్హులైన పౌరులు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకుంటే వారి కార్డులు తిరిగి యథావిధిగా యాక్టివేట్ అవుతాయి.
మొబైల్‌లోనే ఈకేవైసీ పూర్తి చేసే వెసులుబాటు.. మేరా రేషన్ యాప్:
లబ్ధిదారులు తమ రేషన్ కార్డును రద్దు కాకుండా కాపాడుకోవడానికి వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించిన ‘మేరా రేషన్’ మొబైల్ యాప్, ‘ఆధార్ ఫేస్ ఆర్డీ’ యాప్ ద్వారా ఇంటి నుంచే సులువుగా ఫేస్ స్కాన్ చేసి కేవైసీ చేసుకోవచ్చు. అంతేకాకుండా, సమీపంలోని మీసేవా కేంద్రాలు లేదా కామన్ సర్వీస్ సెంటర్లను సందర్శించి కూడా ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసుకోవచ్చు.
