Ethanol Atms: ఇక ఎల్పీజీ గ్యాస్‌కు గుడ్‌బై.. త్వరలో ఇథనాల్ ఏటీఎంలు.. మార్కెట్లోకి కొత్త ఇథనాల్ స్టవ్‌లు
ఎల్పీజీకి బదులుగా 'ఇథనాల్(Ethanol Atms)'ను వంట ఇంధనంగా ప్రోత్సహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
- V Santhosh Kumar
- Published on- July 21, 2026 / 07:59 AM IST
Central government to introduce ethanol atms as lpg alternative
- త్వరలో ఇథనాల్ ఏటీఎంల విక్రయం
- ఎల్పీజీ గ్యాస్‌కు సరికొత్త ప్రత్యామ్నాయం
- సామాన్యులకు తగ్గనున్న వంట ఖర్చులు
Ethanol Atms: దేశంలో వంట గ్యాస్ (LPG) వాడకానికి సరికొత్త ప్రత్యామ్నాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన అవసరాలు, పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంప్రదాయ ఎల్పీజీకి బదులుగా ‘ఇథనాల్’ను వంట ఇంధనంగా ప్రోత్సహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీని ద్వారా సామాన్య ప్రజలకు మరింత చవకగా, సురక్షితంగా వంట ఇంధనాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా మారింది.
ఏటీఎంల ద్వారా ఇథనాల్ విక్రయం:
ఈ సరికొత్త రిటైల్ మోడల్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా ‘ఇథనాల్ ఏటీఎంలను(Ethanol Atms)’ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. వినియోగదారులు నేరుగా ఈ ఏటీఎం కేంద్రాలకు వెళ్లి తమ వద్ద ఉన్న డబ్బాలు లేదా ప్రత్యేక పాత్రల్లో ఇథనాల్‌ను రీఫిల్ చేసుకోవచ్చు. పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపుకున్నట్లే, అతి సులభంగా వీటికి వెళ్లి కావాల్సిన పరిమాణంలో ఇథనాల్‌ను కొనుగోలు చేసే వెసులుబాటు అందుబాటులోకి రానుంది.
ప్రత్యేక స్టవ్‌లు, ప్రయోజనాలు:
సాధారణ ఎల్పీజీ స్టవ్‌లలో ఇథనాల్‌ను వాడటం సాధ్యం కాదు కాబట్టి, దీనికోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఇథనాల్ స్టవ్‌లను మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఈ విధానం వల్ల ఎల్పీజీ సిలిండర్ల కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. పర్యావరణహితమైన ఈ స్వచ్ఛమైన ఇంధనం అందుబాటులోకి వస్తే గృహావసరాల వంట ఖర్చులు తగ్గడమే కాకుండా, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడటం కూడా గణనీయంగా తగ్గుతుంది.
