అయోధ్య తీర్పు :అమిత్ షా నివాసంలో ఉన్నతస్థాయి భేటీ

  • Publish Date - November 9, 2019 / 06:05 AM IST

అయోధ్య రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు ఇవాళు తీర్పు వెల్లడించింది.తీర్పు వెలువరించకముందే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన షా నివాసంలో అత్యున్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఛీప్ అర్వింద్ కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తీర్పు అనంతరం దేశంలో జరుగునున్న పరిణామాలపై చర్చలు కొనసాగుతున్నాయి. భద్రత ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష కొనసాగుతోంది. దీని కోసం  కేంద్ర హోంశాఖ కార్యాలయంలో ప్రత్యేక సెల్ కూడా ఏర్పాటు చేశారు.తీర్పు వచ్చాక అల్లర్లు చెలరేగే అవకాశం ఉండటంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. అన్ని రాష్ర్టాలను కేంద్ర హోంశాఖ ఇప్పటికే అప్రమత్తం చేసింది. అన్ని చారిత్రాత్మక..ప్రతిష్టాత్మక దేవాలయాలలోను భద్రతను కట్టుదిట్టంచేసింది.