ట్రాఫిక్ ఫైన్స్ భారీగా పెరిగిన సమయంలో వాహనదారులు గుండెల్లో గుబులుమొదలైంది. రూల్ అతిక్రమించి ట్రాఫిక్ పోలీసుకు కనబడితే వేలల్లో ఫైన్లు. కానీ, పంజాబ్‌లో మాత్రం వేరేలా ఉంది. ఓ పోలీసు నో పార్కింగ్ లో వెహికల్ పెట్టద్దని పాటలు పాడుతూ వాహనదారుల్లో ఉత్సాహం నింపుతున్నాడు.
1995లో ఫ్యామస్ గా మారిన డాలెర్ మెన్డీ పాట బోలో తా రా రా.. అంటూ పాటు అందుకున్నాడు. అంతేకాదు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. చివరకు డాలెర్ మెన్డీకు వరకూ చేరడంతో ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కోసం పోలీసులు నా పాటు వాడుతుండటం నాకు సంతోషంగా ఉందంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు.
పాటను నో పార్కింగ్.. నో పార్కింగ్.. అంటూ మొదలుపెట్టి.. ఓకే పార్కింగ్ మే జావో.. వెరీ గుడ్ అని వాహనదారులకు కాంప్లిమెంట్స్ ఇస్తూనే ఇన్‌స్పైర్ చేస్తున్న వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.