Navjot Singh Sidhu : సిద్ధూ క్షమాపణలు చెప్పు..ఫైర్ అవుతున్న పంజాబ్ కాప్స్

సిద్ధూ వ్యాఖ్యలపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ సీనియర్‌ నాయకుడు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, పోలీసులను అవమానించడం సిగ్గుచేటన్నారు.

Chandigarh DSP : ఎప్పుడూ ఏదో ఒక మాట జారి వివాదాల్లో ఉండే పంజాబ్‌ పీసీసీ చీఫ్‌ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరో వివాదంలో చిక్కుకున్నాడు. సిద్ధూపై పంజాబ్‌ పోలీసులు ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఓ సభలో పాల్గొన్న సిద్ధూ తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రశంసించే క్రమంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు తలచుకుంటే పోలీసుల ప్యాంట్లు తడిచిపోయేలా చేయగలరన్నారు. దీనిపై పోలీసులు ఫైర్‌ అయ్యారు. అయినా సిద్ధూ స్పందించలేదు సరికాదా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు. దీంతో సిద్ధూపై పోలీసులు పరువు నష్టం దావా వేశారు.

Read More : Andhra Pradesh PRC : పీఆర్సీపై సీఎం జగన్ సమీక్ష..తర్వలో ఉద్యోగ సంఘాలతో భేటీ

సిద్ధూ వ్యాఖ్యలపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ సీనియర్‌ నాయకుడు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, పోలీసులను అవమానించడం సిగ్గుచేటన్నారు. సిద్ధూకు ఆయన కుటుంబానికి రక్షణ కల్పిస్తోంది పోలీసులు కాదా అని చండీగఢ్‌ డీఎస్పీ ప్రశ్నించారు. పోలీసుల భద్రతే గనుక లేకపోతే.. సిద్ధూ వ్యాఖ్యలను కనీసం రిక్షాలాగే వ్యక్తి కూడా పట్టించుకోరని విమర్శించారు . సిద్ధూ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. నవజోత్‌ సింగ్‌ సిద్ధూ పోలీసులపై తప్పుగా మాట్లాడటం సరికాదన్నారు. అటు పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌, శిరోమణి అకాలీదళ్‌ నేతలు కూడా సిద్ధూ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధూ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ట్రెండింగ్ వార్తలు