చంద్రయాన్-2 సేఫ్‌: ఇస్రో సైంటిస్ట్‌లు వెల్లడి

ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగం విజయవంతమవుతుందనుకున్న తరుణంలో వాయిదా పడింది. అర్ధరాత్రి 1:53నిమిషాలకు చంద్రయాన్-2 సిగ్నల్స్ అందకుండా పోయాయి. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి సామాన్యులు సైతం కన్నార్పకుండా ఎదురుచూస్తున్న సమయంలో సిగ్నల్ కోల్పోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. 

చంద్రుని ఉపరితలానికి 2.1కి.మీల దూరంలో సిగ్నల్ కోల్పోయిన విక్రమ్ ల్యాండర్ సేఫ్‌గానే ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్దారించారు. ఇస్రో అధికారులు మాట్లాడుతూ.. సిగ్నల్ మాత్రమే కోల్పోయాం. విక్రమ్ ల్యాండర్ మామూలుగానే పనిచేస్తుంది. లూనార్ ఆర్బిటల్‌లో సేఫ్‌గానే ఉంది’ అని అధికారు వెల్లడించారు. సంవత్సరానికి మిషన్ జీవిత కాలం 2వేల 379కేజీ ఆర్బిటర్.

సిగ్నల్ కోల్పోవడంపై భారత ప్రధాని మోడీ స్పందించారు. భారత శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమించారని ప్రధాని ప్రశంసించారు. దేశ ప్రజల కలలను సాకారం చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించారని చెప్పారు. భరతమాత తలెత్తుకునేలా కృషి చేశారని మోడీ కొనియాడారు. జాతి గర్వించేలా దేశం కోసం శాస్త్రవేత్తలు తమ జీవితాలను ధారపోశారని చెప్పారు. దేశం మొత్తం మీకు సంఘీభావంగా రాత్రంతా మేల్కొని ఉందన్నారు. ఇది వెనుకడుగు మాత్రం కాదన్నారు. శాస్త్రవేత్తల మనోభావాలను అర్థం చేసుకున్నా అని మోడీ అన్నారు. చంద్రయాన్ 2 ప్రయోగం చేసిన శాస్త్రవేత్తలపై ప్రధాని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు.