Char Dham Yatra
Char Dham Yatra : ఏప్రిల్ 25 నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. చార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్ నాథ్ ఆలయాన్ని ఏప్రిల్ 25న తెరవనున్నారు. ఈ మేరకు మహాశివరాత్రి సందర్భంగా నిన్న(శనివారం) ఆలయ పున:ప్రదర్శన తేదీని ఆలయ నిర్వహకులు ప్రకటించారు. ఆ రోజు ఓంకారేశ్వర ఆలయంలో ఉదయం 4 గంటలకు మహాభిషేక పూజతో పాటు సంప్రదాయంగా నిర్వహించాల్సిన అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత 6:30 గంటలకు ఆలయ మహాద్వారాన్ని తెరవనున్నారు.
అలాగే అదే రోజు ఉదయం 8:30 గంటలకు కేదార్ నాథుడికి హారతి ఇవ్వనున్నారు. అదే విధంగా ఏప్రిల్ 27న ఉదయం 7:10 గంటలకు బద్రీనాథ్ ఆలయాన్ని తెరవనున్నారు. నవంబర్ 19వ తేదీన బద్రీనాథ్ ఆలయం తలుపులు మూసివేయడంతో చార్ ధామ్ యాత్ర ముగియనుంది.