చెన్నైకి చెందిన వళ్లువర్‌కొట్టమ్ పోలీస్ వీడియో వైరల్ అవుతోంది. బస్‌స్టాప్‌లో ఆగి ఉన్న యువతులను వీడియో తీసి.. వారిని భయపెడుతున్నాడు. పాట్రోలింగ్ లో ఉన్న ఈ పోలీస్ ఫొటోలను క్లిక్ చేస్తుంటే వారంతా మొహాలను దాచుకోవడమో లేదా అక్కడ్నుంచి వెళ్లిపోవడం చేస్తున్నారు.
తమిళనాడు పోలీసులు మొహాలను పోల్చుకునేందుకు ఫేస్ రికగ్నేషన్ యాప్ తయారుచేశారు. దీనిని తమిళనాడు పోలీసులు బాగా వాడుతుండటంతో ప్రజలకు కూడా దాని గురించి తెలిసిపోయింది. అయితే ఈ పోలీస్ తీసిన వీడియో కూడా అలాంటిదేనని స్థానికులు మనకెందుకులే అని తప్పుకుంటున్నారు. నిజానికి ఆ పోలీస్ దగ్గర అలాంటి ముఖాలు గుర్తు పట్టే యాప్ ఏం లేదు.
CAAకు వ్యతిరేకంగా ఆందోళనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇలా కెమెరా తీసి ఫొటోలు తీస్తున్నట్లుగా చేసి వాళ్లను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఓ మహిళ మాట్లాడుతూ.. ‘అతను ఫేస్ రికగ్నేషన్ యాప్ వాడుతున్నాడో లేదో మాకు తెలీదు. అతను చేసే పనులు అనుమానస్పదంగానే ఉన్నాయి. దగ్గర్లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతుంది. అతనికి బస్ స్టాండ్ కు రావాల్సిన పనేం లేదు. కానీ, వచ్చి వ్యక్తుల ఫొటోలు తీస్తున్నాడు. ఒకట్రెండు మా దగ్గరకు వచ్చి ఎందుకు నిల్చొన్నారని అడిగాడు. బస్సు కోసమని చెప్తే త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెప్పాడు’ అని ఆ మహిళ తెలిపింది.
సీఏఏకు వ్యతిరేక ఆందోళనలో పాల్గొనదామని వెళ్తున్న మహిళ పోలీసులు భయపెట్టాలనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఆందోళన జరుగుతున్న ప్రదేశానికి ఎవరూ వెళ్లకుండా చేయాలని ఇలా అందరినీ నిరుత్సాహపరుస్తున్నారని చెప్పారు. ఇక ఈ వీడియోలో ఆ పోలీస్ వీడియో తీస్తుంటే మహిళలు ముఖాలకు చేతులు అడ్డుకుని తప్పించుకుంటున్న ఘటన మీరూ చూడండి.
That’s @chennaipolice_ using #FacialRecognition using the software supplied by FaceTagr on innocent bystanders. pic.twitter.com/fYnY4S0I5a
— Srinivas Kodali (@digitaldutta) January 14, 2020
I have been manhandled & arrested by @chennaipolice_ for merely meeting with two other friends in #valluvarkottam. @YPPIndia @anticaaTN @naukarshah @Shaheenbaghoff1 @jamiamillia_ @KanimozhiDMK @s_kanth #CAAProtest police brutality down down! pic.twitter.com/zxanwPeoqj
— Radhika Ganesh (@radhikaganesh) January 13, 2020