Chennai mayor Priya traveling hanging from CM Stalin car
Tamilnadu: తమినాడు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నై మేయర్ (మహిళ) సీఎం భద్రతా కాన్వాయ్కి వేలాడుతూ కనిపించారు. రాష్ట్ర రాజధాని మేయర్ అయి ఉండి ఇలా భద్రతా సిబ్బందిలాగా కారుకు వేలాడాల్సిన పరిస్థితి ఏంటంటూ విపక్షాలు సహా నెటిజెన్లు విమర్శిస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ డీఎంకే ప్రభుత్వ తీరును తప్పు పడుతున్నారు.
మంటస్ తుపాను శుక్రవారం రాత్రి చెన్నై తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో చెన్నై పరిసర ప్రాంతాల్లో వర్షం, గాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం కారణంగా కొన్ని చోట్ల చెట్లు కూలిపోయి నష్టం వాటిల్లింది. తీర ప్రాంతాల్లోని ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై కార్పొరేషన్ పరిధిలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రాంతాలను పరిశీలించారు. ఆ సమయంలో చెన్నై కార్పొరేషన్ మేయర్ ప్రియా రాజన్, చెన్నై కార్పొరేషన్ కమిషనర్ గగన్‌దీప్ బేడీ సీఎం కారుకు వేలాడుతూ కనిపించారు. వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
చెన్నై మేయర్ ఈమె. పేరు ప్రియా రాజన్.
మేయరుగా దళిత మహిళను చేశామని సీఎం స్టాలిన్ మహా గొప్పలు చెప్పారు. మూన్నాళ్లు కాలేదు.
మంత్రుల కంటే ఎక్కువ ప్రోటోకాల్ ఉంటుంది ఈమెకు. అయినా సీఎంతో వెళ్లాలంటే ఇలా కాన్వాయ్ తో వేలాడాల్సి వచ్చింది.
ఇవేనా ద్రవిడ పాలిటిక్స్? pic.twitter.com/lfnqdNnpD1— Tony (@tonybekkal) December 11, 2022
‘ముందు గొడుగు పట్టి, తర్వాత ఇలా చూస్తారా?’ నెటిజెన్లు విమర్శిస్తున్నారు. పైగా ప్రియా రాజన్ దళిత మహిళ కావడంతో విమర్శలు మరింత ఎక్కు పెట్టారు. దళిత మహిళ అయితే మాత్రం కనీసం ఆమె హోదాను చూడకుండా ఇలా ప్రవర్తిస్తారా అంటూ మండిపడుతున్నారు. చెన్నై మేయర్ అంటే, మంత్రి స్థాయి హోదా ఉంటుంది. కానీ ప్రియా ఇలా కనిపించడం వివాదాస్పదంగా మారింది. ఇక కారుకు వేళాడుతుండగా ఫొటోలు తీస్తున్నారని ప్రియా ఆమె ముఖాన్ని దాచుకునే ప్రయత్నం చేశారు.
MCD Polls: ఓటమికి బాధ్యత వహిస్తూ ఢిల్లీ బీజేపీ చీఫ్ పదవికి ఆదేశ్ గుప్తా రాజీనామా