Manoj Singh Mandavi Died : ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ గుండె పోటుతో మృతి

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌, అధికార కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మనోజ్‌ సింగ్‌ మాండవి(58) గుండెపోటుతో మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఆయన మరణించారు. మాండవి తన స్వగ్రామమైన నాథియా సవాగాన్‌లో శనివారం రాత్రి అస్వస్థతకు గురైనట్లు అధికారులు పేర్కొన్నారు.

  • Published On : October 16, 2022 / 01:19 PM IST

Manoj Singh Mandavi Died

Manoj Singh Mandavi Died : ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌, అధికార కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మనోజ్‌ సింగ్‌ మాండవి(58) గుండెపోటుతో మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఆయన మరణించారు. మాండవి తన స్వగ్రామమైన నాథియా సవాగాన్‌లో శనివారం రాత్రి అస్వస్థతకు గురైనట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆయన్ని చికిత్స కోసం వెంటనే చరమలోని ఆస్పత్రికి తరలించారు.

అనంతరం మెరుగైన చికిత్స కోసం ధామ్‌తరిలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ప్రస్తుతం మనోజ్‌ సింగ్‌ మాండవి కంకేర్‌ జిల్లాలోని భానుప్రతాప్‌పూర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాండవి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Pakistan: పాకిస్థాన్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. ఓ ఆసుపత్రి భవనం పైకప్పుపై 200 కుళ్ళిన మృతదేహాలు..

2002- 2003 వరకు అజిత్‌జోగి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో హోం మంత్రి, జైళ్ల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. మాండవి మృతికి ఛత్తీస్‌గఢ్‌ సీఎం బూపేస్‌ బాగెల్‌, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సంతాపం తెలిపారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.