Pakistan: పాకిస్థాన్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. ఓ ఆసుపత్రి భవనం పైకప్పుపై 200 కుళ్ళిన మృతదేహాలు..

పాకిస్థాన్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. ముల్తాన్ నగరంలోని ఓ ఆసుపత్రి పైకప్పుపై 200 కుళ్ళిన మృతదేహాలను గుర్తించారు. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి ఆరుగురు సభ్యుల కమిటీని దర్యాప్తు కోసం ఏర్పాటు చేశారు.

Pakistan: పాకిస్థాన్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. ఓ ఆసుపత్రి భవనం పైకప్పుపై 200 కుళ్ళిన మృతదేహాలు..

200 corpses in Pakistan Hosptal

Updated On : October 16, 2022 / 12:16 PM IST

Pakistan: పాకిస్థాన్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. ముల్తాన్ నగరంలోని ఓ ఆసుపత్రి పైకప్పుపై 200 కుళ్ళిన మృతదేహాలను గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ముల్తాన్‌లోని నిష్టర్ హాస్పిటల్ మార్చురీ పైకప్పు నుండి వందలాది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఒక కమిటీని నియమించింది. అయితే మృతదేహాల సంఖ్యపై పాక్ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

20 Killed In Accident : కొలంబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా పడి 20 మంది మృతి

పాకిస్థాన్‌లోని నిష్టర్ హాస్పిటల్ మార్చురీ భవనం పైభాగంలో మృతదేహాలను అధికారులు గుర్తించారు. పాకిస్తాన్ పంజాబ్ ముఖ్యమంత్రి సలహాదారు తారిఖ్ జమాన్ గుజ్జర్‌కు మృతదేహాల గురించి సమాచారం వచ్చింది. గుజ్జర్ ఈ విషయాన్ని నిర్ధారణ చేసుకునేందుకు కొందరు ఉన్నతాధికారులతో మార్చురీకి వెళ్లాడు. అయితే, సిబ్బంది గేట్లను తెరవడానికి నిరాకరించారు. తనను లోపలికి అనుమతించకపోతే పోలీసులకు ఫిర్యాదు చేసిన మీపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాయిస్తానని హెచ్చరించడంతో చివరకు సిబ్బంది గేట్లు తెరిచారు. తారిఖ్ లోపలికి వెళ్లి చూడగా.. దాదాపు 200 మంది పురుషులు, స్త్రీల డెడ్ బాడీలను కనుగొన్నాడు.

Pawan Kalyan : పవన్ పర్యటన కోసం ప్రత్యేక బస్సు సిద్ధం

ఈ ఘటనపై ఆరా తీయగా.. వైద్య విద్యార్థులు ఆ మృతదేహాలను వారి ప్రయోగాలకోసం ఉపయోగించారని అక్కడి వైద్యులు చెప్పారు. పైకప్పు మీద, పురుగులు, రాబందులు తింటున్న 35 మృతదేహాలను తారిఖ్ గుర్తించాడు. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఎలాహి పంజాబ్ హెల్త్‌కేర్, మెడికల్ ఎడ్యుకేషన్ సెక్రటరీతో సహా ఆరుగురు సభ్యుల కమిటీని దర్యాప్తు కోసం ఏర్పాటు చేశారు.