20 Killed In Accident : కొలంబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా పడి 20 మంది మృతి
కొలంబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు బోల్తా పడి 20 మంది మృతి చెందారు. నైరుతి కొలంబియాలోని పాన్ అమెరికన్ హైవేపై బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.

bus accident in colombia
20 Killed In Accident : కొలంబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు బోల్తా పడి 20 మంది మృతి చెందారు. నైరుతి కొలంబియాలోని పాన్ అమెరికన్ హైవేపై బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో 20 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. తీవ్రమైన పొగమంచు కారణంగా మూలమలపు వద్ద డ్రైవర్ బస్సుపై పట్టు కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. రేవు పట్టణమైన ముమాకో నుంచి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు.