Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ఘటన.. తొమ్మిది మంది మృతి

కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హాసన్ జిల్లా గాంధీనగర్ గ్రామ సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో.. నలుగురు చిన్నారులు సహా తొమ్మిది మంది మృతి చెందారు.

Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ఘటన.. తొమ్మిది మంది మృతి

Karnataka Road Accident

Updated On : October 16, 2022 / 10:27 AM IST

Karnataka Road Accident: కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హాసన్ జిల్లా గాంధీనగర్ గ్రామ సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో.. నలుగురు చిన్నారులు సహా తొమ్మిది మంది మృతి చెందారు. శనివారం అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులంతా పుణ్యక్షేత్రమైన ధర్మస్థలిలోని శ్రీ మంజునాథ క్షేత్రానికి వెళ్లి దర్శనానంతరం తిరిగి వస్తున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.

Nine Died In Road Accident : విహారయాత్రలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు, టీచర్ సహా 9 మంది మృతి

టెంపో ట్రావెలర్ జాతీయ రహదారి-69పై KSRTC బస్సు వెనుక ప్రయాణిస్తోంది. అదే మార్గంలో వస్తున్న పాల ట్యాంకర్‌ను గమనించిన టెంపో డ్రైవర్‌ వాహనాన్ని ఎడమవైపుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించి బస్సును ఢీకొట్టాడు. అనంతరం వెనుక నుంచి ట్యాంకర్‌ టెంపో ట్రావెలర్‌ను ఢీకొట్టింది. జంక్షన్‌లో వన్‌వేపై సూచిక బోర్డు లేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం సమయంలో టెంపో వాహనంలో 14 మంది ప్రయాణికులు ఉన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ ప్రమాదంలో మృతులను లీలావతి (50), చైత్ర (33), సమర్థ (10), డింపి (12), తన్మయ్ (10), ధ్రువ (2), వందన (20), దొడ్డయ్య (60), భారతి (50)గా గుర్తించారు. టెంపో వాహనంలోని పలువురికి, కేఎస్‌ఆర్‌టీసీ బస్సులోని ప్రయాణికులకు కూడా గాయాలయ్యాయి. ట్యాంకర్‌ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. బన్సావర్ పోలీసులు ఈ ప్రమాదంపై విచారణ చేపట్టారు.