Chhattisgarh man Ashok chakradhari Magic Lamp : దీపావళి వచ్చిందంటే ఇల్లంతా వెలుగులతో నిండిపోవాలని ఎంతో ఇష్టంగా కష్టపడి దీపాల వెలిగిస్తాం. కానీ గాలివేస్తే ఆ దీపాలు ఆరిపోతాయి. దీంతో అయ్యో దీపం ఆరిపోయిందే (కొండెక్కిందనీ..గనువైందనీ) మళ్లీ మళ్లీ వెలిగిస్తాం. అలా ఏదీపం ఆరిపోకుండా చూస్తుంటాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే దీపం మాత్రం ఒక్కసారి వెలిగిస్తే చాలా ఆరనే ఆరదు.
అస్తమాను దీపంలో నూనె అయిపోయిందేమో చూసుకోనకర్లేదు నూనె పోయనక్కరలేదు. ఒక్కసారి పోస్తే చాలు.. రోజంతా దీపం చక్కగా వెలుగుతూనే ఉంటుంది. ఆ అద్భుతమైన దీపాన్ని తయారుచేసింది ఓ సాధారణ కుమ్మరి వ్యక్తి కావాటం విశేషం..మట్టి కుండలు..దీపాలు, కూజాలు తయారు చేసే ఓ సాధారణ వ్యక్తి.
ఎంతో బలంగా గాలి వస్తే తప్ప (మాగ్జిమమ్) ఈ దీపం ఆరదు,మాటిమాటికీ దీన్ని వెలిగించాల్సిన పని లేదు. ఈ దీపం తయారు చేయటానికి ఎటువంటి టెక్నాలజీ వాడలేదు. ఈ అద్భుత దీపం తయారుచేశారు అశోక్ చక్రధారి. స్వతహాగా కుమ్మరి అయిన ఈయన…మట్టితో తయారు చేసిన ఈ వెరైటీ దీపాన్ని తయారు చేసి ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిపోయాడు.
ఈ దీపం గురించి తెలిసిన వారు చాలామంది ఆ దీపానికి ఫిదా అయిపోయారు ఇటువంటి దీపం మాకు కావాలంటేమాకు కావాలని కోరుతున్నారు. ఇది దీపమే అయినా… చూడటానికి చిన్న సైజు లాంతరులా ఉంటుంది. చాలా వెరైటీగా క్యూట్ గా ఉంటుంది. మరీ ఈ అద్భుత దీపాన్ని తయారు చేసిన అశోక్ చక్రధారి గురించి తెలుసుకుందాం..
ఛత్తీస్‌గఢ్.. కొండగావ్ గ్రామానికి చెందిన అశోక్ చక్రధారి… ఓ యూట్యూబ్ వీడియో చూసి… ఈ ల్యాంప్ తయారుచేశాడట. దీపం పైన డోమ్ షేపులో ఉన్న రిజర్వాయర్ లాంటిదానిలో నూనె ఉంటుంది. అది కంటిన్యూగా దీపానికి నూనెను అందిస్తూ ఉంటుంది. మిగిలిన నూనె తిరిగి డోమ్‌లోకి వెళ్లిపోతుంది. మళ్లీ అదే నూనె పై నుంచి దీప ప్రమిదలో పడుతుంది. ఇలా జరగడం వల్ల వత్తికి నిరంతరం నూనె అంది అది ఆరిపోయే (కొండెక్కే) పరిస్థితి ఉండదు.
ఈ దీపం గురించి చక్రధాని మాట్లాడుతూ..నా కుమ్మరి పనిలో… ప్రతి సారీ కొత్తగా ఏదైనా చేయాలని అనుకుంటుంటాను. అలాగే ఈ కొత్త దీపాన్ని తయారు చేశాను. ఇది చూసిన చాలామంది మాక్కూడా కావాలని అడుగుతున్నారు. రీ-ఫిల్లింగ్ రిజర్వాయర్‌ను దీపానికి సెట్ చేయడం వల్ల ఇది చక్కగా ఒక్కసారి వెలిగిస్తే రోజంతా వెలుగుతుంది.
ఈ దీపం తయారు చేయటానికి చక్రధాని మొదట్లో ఐదారు గంటలు కష్టపడ్డాడు. డోమ్ రిజర్వాయర్ సైజ్ పెద్దగా..బరువుగా ఉండి..దీప ప్రమిద తిరగబడిపోయేదట.అలా మార్పులూ చేర్పులూ చేస్తూ మొత్తానికి అద్భుతమైన దీపాన్ని తయారు చేశానని అంటున్నాడు చక్రధారి.
2019 దీపావళికి ఇటువంటి దీపాలను 100 దాకా అమ్ముడయ్యాయనీ చెప్పాడు చక్రధారి. దీనికి సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్ లో పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యిుంది. దీంతో… పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయని చక్రధాని ఆనందంగా తెలిపాడు. మరి ఈ అద్భుత దీపం వీడియోను మీరు కూడా చూసేయండీ..