వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈవీఎంలతోనే ఎన్నికలు : సీఈసీ

ఈవీఎంల పని తీరుపై వస్తున్న విమర్శలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Publish Date - January 24, 2019 / 08:28 AM IST

ఈవీఎంల పని తీరుపై వస్తున్న విమర్శలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ : ఈవీఎంల పని తీరుపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. ఈవీఎంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీలు ఈవీఎంలలో అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈవీఎంల పని తీరుపై వస్తున్న విమర్శలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు, ఇతర సంస్థల నుంచి వచ్చే అభ్యంతరాలను, ఫిర్యాదులను స్వీకరిస్తామని చెప్పారు. 

అయితే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఎన్నికల కమిషన్ మాత్రం ఈవీఎంల పనితీరు, వాటి వాడకం పై వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. బ్యాలెట్ పేపర్లు వాడబోమని సునీల్ అరోరా తేల్చి చెప్పారు. రాజకీయ పార్టీల అభ్యంతరాలు స్వీకరించి, పరిశీలిస్తామన్నారు. ఈవీఎం, వీవీ ప్యాట్‌లను వచ్చే ఎన్నికల్లో కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.