Chief Justice Of India Brings Daughters To Work
CJI: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ.వై చంద్రచూడ్ శుక్రవారం సుప్రీంకోర్టు జడ్జీలను ఆశ్చర్యగానికి గురి చేశారు. తన ఇద్దరు పెంపుడు కుమార్తెలను సుప్రీం కోర్టుకు తీసుకువచ్చారు. అనంతరం తన చాంబర్‌ను చూపించి, కోర్టు కార్యకలాపాలను వివరించారు. ఇదంతా జడ్జీలు, లాయర్లు చాలా ఆసక్తిగా గమనించారు. అలాగే ఇద్దరు పెంపుడు కుమార్తెలను పరిచయం చేసుకుని మాట్లాడారు.
Yogi Adityanath: గూండాలు మీపై దాడిచేయరు.. బాలీవుడ్ ప్రముఖులతో యోగీ ఆదిత్యానాథ్
ప్రియాంక (20), మహి (16) అనే ఇద్దరు దివ్యాంగులను జస్టిస్ చంద్రచూడ్ దత్తత తీసుకుని తన కుమార్తెలుగా పెంచుకుంటున్నారు. కాగా, శుక్రవారం ఉదయం తన ఇద్దరు కుమార్తెలతో కలిసి సుప్రీంకోర్టుకు వచ్చారు. పబ్లిక్ గ్యాలరీ నుంచి వారు కోర్టులోకి ప్రవేశించారు. అక్కడి నుంచి నేరుగా ఒకటో గదిలోని సీజేఐ కోర్ట్‌కు వెళ్ళారు. కోర్టు కార్యకలాపాలు ఏ విధంగా జరుగుతాయో తన కుమార్తెలకు చంద్రచూడ్ వివరించారు. జడ్జిలు ఎక్కడ కూర్చుంటారు? న్యాయవాదులు ఎక్కడి నుంచి వాదనలు వినిపిస్తారు? అనే అంశాలను సైతం వివరించారు. అనంతరం ఆయన వారిద్దరినీ తన చాంబర్‌కు తీసుకెళ్ళి కాసేపు ముచ్చటించారు.
Jammu and Kashmir: గులాం నబీ ఆజాద్‌కు బిగ్ షాక్.. తిరిగి కాంగ్రెస్‌లో చేరిన జమ్మూ కశ్మీర్ నేతలు