Renuka Gupta dies : కరోనాతో మృతి చెందిన బాలల సంక్షేమ కార్యకర్త రేణుకా గుప్తా

Renuka Gupta dies of virus : కరోనాకు వాళ్లు వీళ్లు అని తేడాలేదు. పేదలు,ధనవంతులు, సమాజానికి మంచిచేసేవాళ్లు, దుష్టులు,దుర్మార్గులు ఎవరైనా సరే కరోనాకు ఒక్కటే వచ్చిందంటే ఏసుకుపోతోంది. ఈ మహమ్మారికి ఎంతోమంది యోధాను యోధులే బలైపోయారు. అలా సమాజానికి ఎంతో సేవలు చేసి..బాలల సంక్షేమానాకి బంగారు బాటలు వేయటానికి ఎంత కృష్టిచేస్తూ..1300ల మంది బాలల్ని చేరదీసి అమ్మలా చూసుకుంటున్నా బాలల సంక్షేమ కార్యకర్త రేణుకా గుప్తా కరోనా కాటుకు బైలపోయారు. గత దశాబ్దాలుగా బాలల సంక్షేమం కోసం కృషి చేస్తున్న రేణుకాకు ఏప్రిల్ 20న కరోనా సోకింది. ఆ తర్వాత రెండు రోజులకే నోయిడాలోని ఓ ఆసుపత్రిలో చేరిన రేణక అక్కడ చికిత్స పొందుతూ గురువారం (మే 19,5,2021) ఉదయం తుదిశ్వాస విడిచారు.

యూపీలో రేణుక బాలల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు రేణుక గుప్తా. ఈ క్రమంలోనే 56 ఏళ్ల వయస్సులో కరోనా బారినపడి కన్నుమూశారు. పలు ఎన్జీవోలు, సంక్షేమ సంఘాలతో కలిసి పనిచేసిన ఆమెకు భర్త ఇందు ప్రకాశ్ సింగ్, ఓ కొడుకు, ఓ కూతురు ఉన్నారు. రేణుకా గుప్తా ప్రకాశ్ సింగ్ కూడా సామాజిక కార్యకర్తే.

రేణుక తన సగ జీవితాన్ని బాలల హక్కుల కోసం వారికి విద్యతో పాటు పలు సౌకర్యాలు అందాలని పోరాడారు. అలాగే లింగ వివక్ష కూడా పోరాడారు. ఆమె స్వంతంగాను..తన భర్త ప్రకాశ్ సింగ్ తో కలిసి కలిసి పలు పుస్తకాలు రచించారు. 1300లమంది పిల్లల ఆలనా పాలనా చూసేవారు. నేను కన్న ఇద్దరు పిల్లలకే నేను తల్లిని కాదు నేను చేరదీసి 1300 మందికీ కూడా తాను అమ్మనేను రేణుక చెబుతుండేవారు. రేణుకా గుప్తాకు పశ్చిమ యూపీలో ఓ ఆర్గనైజేషన్ ఉంది. దాన్ని ద్వారా 1300 బాలికల సంరక్షణను చూసుకుంటున్నారామె. ఈ క్రమంలో అనాథ బాలల అమ్మ కరోనాతో కన్నుమూసింది.

 

ట్రెండింగ్ వార్తలు