దేశ వ్యాప్తంగా లోక్ సభ రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. సినీ ప్రముఖులు కూడా క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
దేశ వ్యాప్తంగా లోక్ సభ రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. సినీ ప్రముఖులు కూడా క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చెన్నైలో తమిళ సినీ నటులు అజిత్, ఆయన భార్య షాలిని, మరో సినీ నటుడు విజయ్ కూడా ఓటు వేశారు.
Also Read : జీవీఎల్ పై చెప్పుతో దాడి : ప్రెస్ మీట్ షాక్
నటులు సూర్య-జ్యోతిక దంపతులు, కార్తీ, విజయ్, కమల్‌హాసన్, కుమార్తె శృతిహాసన్, ఖుష్బూ క్యూలో నిలబడి ఓటు వేశారు. ఇక బెంగళూరు సెయింట్ జోసెఫ్ కాలేజీలో ప్రకాష్‌రాజ్ ఓటేశారు. వేసవి దృష్ట్యా ప్రజలంతా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సేలంలోని ఎడప్పాడిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.