Cipla ViraGen: సిప్లా నుంచి ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ కిట్

ప్రధాన డ్రగ్ కంపెనీ సిప్లా.. ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ కిట్ ViraGenను లాంచే చేసేందుకు రెడీ అయింది. ఇండియాలో ఆర్టీపీసీఆర్ కిట్ విరాజెన్ ను యూబయో టెక్నాలజీ...

Cipla Viragen

Cipla ViraGen: ప్రధాన డ్రగ్ కంపెనీ సిప్లా.. ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ కిట్ ViraGenను లాంచే చేసేందుకు రెడీ అయింది. ఇండియాలో ఆర్టీపీసీఆర్ కిట్ విరాజెన్ ను యూబయో టెక్నాలజీ సిస్టమ్స్ తో కలిపి లాంచ్ చేయనుంది. ఈ లాంచ్ అనేది ప్రస్తుత టెస్టింగ్ సర్వీసుల కెపాసిటీని పెంచుతుంది. డయాగ్నోస్టిక్ సర్వీసులు విస్తరించడానికి ఉపయోగపడుతుంది.

యూబయో టెక్నాలజీ సిస్టమ్స్ తో కలిసి విరాజెన్ టెస్ట్ కిట్ ను లాంచ్ చేస్తున్నారని కంపెనీ తెలిపింది. ఈ కిట్ ను 2021 మే 25 నుంచి సప్లై చేయనుంది.

సిప్లా ఎండీ, గ్లోబల్ సీఈఓ, ఉమంగ్ వొహ్రా ఈ లాంచింగ్ పై నిర్విరామంగా కష్టపడుతున్నామని కొవిడ్ పై పోరాటంలో ఇది కూడా భాగమవుతుందని అన్నారు. ఇలాంటి కీలక సమయాల్లో దేశవ్యాప్తంగా అందజేసే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.