JP Nadda–CJP Leaders: నడ్డాతో సీజేపీ భేటీ సక్సెస్.. సీజేపీ ప్రధాన డిమాండ్లు ఇవే.. ప్రభుత్వం తదుపరి స్టెప్ ఏంటి?
కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ (JP Nadda–CJP Leaders) ప్రతినిధి బృందం నిర్వహించిన కీలక సమావేశం సానుకూల వాతావరణంలో ముగిసింది.
- V Santhosh Kumar
- Published on- July 20, 2026 / 08:17 PM IST
CJP party leaders meeting with JP Nadda and explain their demands
- కేంద్ర మంత్రి నడ్డాతో భేటీ
- సోనమ్ వాంగ్‌చుక్ విడుదల డిమాండ్
- నీట్ బాధితులకు పరిహారం చెల్లింపు
JP Nadda–CJP Leaders: కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధి బృందం నిర్వహించిన కీలక సమావేశం సానుకూల వాతావరణంలో ముగిసింది. తాము సమర్పించిన వినతిపత్రాన్ని ప్రభుత్వం శ్రద్ధగా పరిశీలించి, సమస్యలపై తగిన నిర్ణయం తీసుకుంటుందని నేతలు ధీమా వ్యక్తం చేశారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులపై ఎటువంటి బలవంతపు చర్యలు ఉండబోవని మంత్రి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ క్రమంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా మద్దతుదారులు సహకరించాలని కోరారు.
సీజేపీ ప్రధాన డిమాండ్లు ఇవే:
సమావేశం అనంతరం సీజేపీ ప్రతినిధులు(JP Nadda–CJP Leaders) తమ ప్రధాన డిమాండ్లను స్పష్టం చేశారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు. NEET అక్రమాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని లేదంటే కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే, ప్రాణాలు కోల్పోయిన 20 మందికి పైగా నీట్ అభ్యర్థుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం అందించాలని స్పష్టం చేశారు.
సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు నడ్డా విజ్ఞప్తి:
ఈ భేటీపై జేపీ నడ్డా స్పందిస్తూ.. ఉదయం 11:50 గంటలకు ప్రారంభమైన చర్చలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. ప్రతినిధుల నుంచి మౌఖికంగా, అనంతరం లిఖితపూర్వకంగా వినతిపత్రం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిరసనకారులు తమ ఆందోళనను విరమించి శాంతిభద్రతల పునరుద్ధరణకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్రం త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశముంది.
