CJP Protest: ముంబై ప్రొటెస్ట్ లో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన.. శివాజీ పార్క్ వద్ద రచ్చ!
ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ(CJP Protest) భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది.
- V Santhosh Kumar
- Published on- October 2, 2026 / 06:28 PM IST
CJP protest mumbai shivaji park demanding cec gyanesh kumar resignation
CJP Protest: దేశంలో ఓటర్ల జాబితా సవరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ శుక్రవారం ముంబైలోని చారిత్రాత్మక శివాజీ పార్కులో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ఆందోళన కార్యక్రమానికి సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే, కో-కన్వీనర్లు అశుతోష్ రాంకా, సౌదవ్ దాస్‌లతో పాటు వందలాది మంది నిరసనకారులు, కార్యకర్తలు హాజరై ఎన్నికల సంఘం తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
స్థానికుల ఆగ్రహం.. స్తంభించిన ట్రాఫిక్, దెబ్బతింటున్న వ్యాపారాలు:
మరొకవైపు శివాజీ పార్క్ వద్ద సీజేపీ(CJP Protest) చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమానికి వ్యతిరేకంగా స్థానిక నివాసితులు, వ్యాపారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరసనల కారణంగా తీవ్ర శబ్ద కాలుష్యం, రాకపోకలకు ఇబ్బందులు కలగడమే కాకుండా అత్యవసర వాహనాల కదలికలపై ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శివాజీ పార్క్ వంటి రద్దీ ప్రాంతాల్లో నిరసనలు నిర్వహించడం వల్ల తమ రోజువారీ పనులు, వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, నిత్య జీవితం అస్తవ్యస్తమవుతోందని స్థానికులు మండిపడుతున్నారు.
సీజేపీకి వ్యతిరేకంగా “జెన్ నెక్స్ట్ ముంబై” పొటీ నిరసన.. టీమ్-బి అని తీవ్ర ఆరోపణలు:
ఇదే సమయంలో సీజేపీ తీరును తప్పుబడుతూ “జెన్ నెక్స్ట్ ముంబై” గ్రూప్ అదే ప్రాంగణంలో శాంతియుత పోటీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే యువతను తప్పుదారి పట్టిస్తున్నారని, వారు రాజ్యాంగ విరుద్ధమైన డిమాండ్లు చేస్తున్నారని నిరసనకారులు ఆరోపించారు. సీజేపీ అసలు రాజ్యాంగాన్ని పరిరక్షించే ఉద్దేశంతో లేదని, వారు ఆమ్ ఆద్మీ పార్టీ మరియు అరవింద్ కేజ్రీవాల్‌లకు ‘టీమ్-బి’గా వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
