AP Liquor Policy: ఏపీ మద్యం దుకాణాల దరఖాస్తుదారులకు అలర్ట్.. గడువు తేదీ పొడిగింపు.. కొత్త షెడ్యూల్ ఇదే!
ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం(AP Liquor Policy) విధానం, దుకాణాల కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అతిముఖ్యమైన ప్రకటన చేసింది.
AP government extends liquor shop application deadline to October 6.
AP Liquor Policy: ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం విధానం, దుకాణాల కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అతిముఖ్యమైన ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 807 ఏ4 రకం మద్యం(AP Liquor Policy) దుకాణాల లైసెన్సుల కేటాయింపు ప్రక్రియకు సంబంధించి దరఖాస్తుల గడువును మరో మూడు రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వ్యాపారులు, దరఖాస్తుదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెలువరించింది. ఈ పొడిగింపుతో దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు మరికొంత సమయం లభించినట్లయింది.
Auto Fare Hike: తెలంగాణలో పెరిగిన ఆటో ఛార్జీలు.. అధికారిక ఉత్తర్వులు జారీ.. ఎంత పెరిగాయో తెలుసా?
అక్టోబర్ 6 వరకు ఛాన్స్.. లాటరీ విధానంలో లైసెన్సుల కేటాయింపు:
నూతన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుదారులు అక్టోబర్ 6వ తేదీ అర్ధరాత్రి వరకు తమ అప్లికేషన్లను సమర్పించుకోవచ్చని అధికారులు వెల్లడించారు. మొత్తం 807 దుకాణాల్లో 799 ఓపెన్ కేటగిరీకి, 8 రిజర్వుడ్ కేటగిరీకి చెందినవిగా వర్గీకరించారు. అందిన దరఖాస్తుల పరిశీలనను అక్టోబర్ 7న పూర్తి చేసి, అక్టోబర్ 8వ తేదీన పారదర్శకంగా లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేయనున్నారు.
దరఖాస్తు రుసుము, అర్హతలు.. ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో అవకాశం:
21 ఏళ్లు పైబడిన అర్హులైన వ్యక్తులు ఎంతమంది అయినా, ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రతి దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్-రిఫండబుల్ ఫీజుతో పాటు రూ.1,000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం ఆన్లైన్, హైబ్రిడ్ లేదా ఆఫ్లైన్ పద్ధతుల్లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని రవాణా, అబ్కారీ శాఖ అధికారులు సూచించారు.
