CM Khattar should clear his stand on Ram Rahim: DCW chief
DCW Chief: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ కట్టర్‌పై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం కేసులో అరెస్టై జైలుకు వెళ్లి ఈ మధ్యే బెయిల్ మీద బయటికి వచ్చిన రాం రహీం బాబాతో ఆయన సమావేశం కావడాన్ని ఆమె తప్పుపట్టారు. అయితే గతంలోనే రాం రహీం బాబాతో తమకు సంబంధం లేదని చెప్పిన వ్యాఖ్యల్ని ఆమె ఖండించారు. ముఖ్యమంత్రి మహిళల పక్షమున్నారో రేపిస్టుల పక్షాన ఉన్నారో బహిరంగంగా స్పష్టం చేయాలంటూ ఆమె డిమాండ్ చేశారు.
फिर से रेपिस्ट और खूनी पाखंडी राम रहीम का तमाशा शुरू। हरियाणा CM @mlkhattar जी के OSD & राज्यसभा सांसद ने फ़र्ज़ी बाबा के दरबार में हाजरी लगायी। खट्टर साहब सिर्फ़ बोलने से काम नहीं चलेगा कि आपका इसमें कोई लेना देना नहीं। खुलके अपना स्टैंड बताओ – रेपिस्ट के साथ हो या महिलाओं के ? pic.twitter.com/4vWBPXK0g1
— Swati Maliwal (@SwatiJaiHind) January 23, 2023
ఈ విషయమై రెండు వీడియోలను తన ట్విట్టర్ ఖాతాలో ఆమె షేర్ చేశారు. మొదటి వీడియోలో హర్యానా సీఎం ఓఎస్డీ, రాజ్యసభ ఎంపీ రాం రహీం బాబాతో మాట్లాడుతున్న వీడియో షేర్ చేస్తూ ‘‘రేపిస్ట్, రక్తపాతకుడు అయిన రాం రహీం బాబా దృశ్యాలు మళ్లీ కనిపిస్తున్నాయి. హర్యానా సీఎం ఓఎస్డీ సహా రాజ్యసభ ఎంపీ వీడియో కాల్ ద్వారా రహీమ్ బాబాతో మాట్లాడుతున్నారు. మీకు ఇలాంటి వారితో సంబంధం లేదని చెప్తే పని చేయదు. మీరు రేపిస్టుల వైపు ఉంటారో, మహిళలవైపు ఉంటారో బహిరంగంగా స్పష్టం చేయండి’’ అని ట్వీట్ చేశారు.
खट्टर जी, देखिए जिस रेपिस्ट को आपने समाज में खुला छोड़ दिया वो कैसे सिस्टम के गाल पर तमाचा मार रहा है। तलवार से कभी महान वीर कमज़ोरों की रक्षा करते थे, आज तलवार से ये रेपिस्ट जश्न माना रहा है। ऐसे काम पर Arms Act में केस दर्ज होता है लेकिन यहाँ तो पूरी सरकार चरणों में पड़ी है। pic.twitter.com/tJpq1HnCna
— Swati Maliwal (@SwatiJaiHind) January 24, 2023
ఇక మరొక ట్వీట్లో పొడవాటి కత్తితో కేక్ కట్ చేస్తున్న గుర్మీత్ బాబా వీడియోను షేర్ చేస్తూ ‘‘ఖట్టర్ జీ.. మీరు సమాజంలో బహిరంగంగా వదిలిపెట్టిన రేపస్ట్, ఈ వ్యవస్థను ఎలా హేళన చేస్తున్నాడో చూడండి. ఒకప్పుడు బలహీనులను ఇవే కత్తులతో మహావీరులు రక్షించేవారు. ఇప్పుడు ఆ కత్తులతోనే రేపిస్టులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇలాంటి వాటిపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు కావాలి. కానీ ఇక్కడి ప్రభుత్వం ఆ నేరస్థుల కాళ్ల దగ్గరే ఉంది’’ అని ట్వీట్ చేశారు.