యూపీ వలస కార్మికులకు ఊరట : త్వరలో వారిని రాష్ట్రానికి తీసుకు వస్తాం

  • Publish Date - April 28, 2020 / 07:00 AM IST

కరోనా లాక్ డౌన్ కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో  చిక్కుకుపోయిన ఉత్తర ప్రదేశ్ కు చెందిన వలస కార్మికులను రాష్ట్రానికితీసుకువస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ చెప్పారు.  

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను తీసుకు వచ్చేందుకు యాక్షన్ ప్లాన్  రూపోందించాలని ఆయన  అధికారులను అదేశించారు.   దేశవ్యాప్తంగా ఒక్కసారి లాక్ డౌన్ విధించటంతో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకు పోయిన వేలాది మంది వలస కార్మికులు కాలి నడకన వారి వారి రాష్ట్రాలకు  కాలినడకన బయలు దేరారు. వ్యయభారాలు, ఆకలిదప్పుల విషయంలో వీరి బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి.  కాగా ఇలా బయలు దేరిన వలస కూలీలను స్ధానిక రాష్ట్ర  ప్రభుత్వాలు వారిని క్వారంటైన్ కు తరలించాయి.

 

సొంత రాష్ట్రం వచ్చిన కార్మికులు స్క్రీనింగ్‌, టెస్టింగ్‌ పూర్తయిన తర్వాత ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్లలో 14 రోజులు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. అనంతరం వారికి రూ.1000 నగదు, రేషన్‌ అందించి సొంత ఊళ్లకు పంపుతామని సీఎం పేర్కొన్నారు. 

ఇదిలాఉండగా.. 20 అంతకన్నా ఎక్కువ కేసులున్న జిల్లాలకు ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌‌ అధికారులను పంపుతామని సీఎం తెలిపారు. వారంపాటు వారు అక్కడే ఉండి.. లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలయ్యేలా చూస్తారని చెప్పారు.