Bhagwant Mann: సెకండ్ మ్యారేజ్ చేసుకున్న సీఎంలు వీరే

సీఎం సీటు గెలిచాక తోడు కావాలనే థాట్ (ఆలోచన) వచ్చిందేమో.. రెండో పెళ్లి చేసుకుని మరోసారి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు పంజాబ్ సీఎం. ఇలా రెండో పెళ్లి చేసుకున్న సీఎం జాబితాలో భగవంత్ మన్ మొదటివాడేం కాదు.

Bhagwant Mann: సీఎం సీటు గెలిచాక తోడు కావాలనే థాట్ (ఆలోచన) వచ్చిందేమో.. రెండో పెళ్లి చేసుకుని మరోసారి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు పంజాబ్ సీఎం. ఇలా రెండో పెళ్లి చేసుకున్న సీఎం జాబితాలో భగవంత్ మన్ మొదటివాడేం కాదు. గతంలోనూ మరికొందరు ఉన్నారు. మరి ఆ సీఎం పెళ్లికొడుకుల గురించి మీకు తెలుసా..

Prapulla Kumar Mohantha

ప్రఫుల్లా కుమార్‌ మహంతా
సీఎంగా ఉన్న టైంలో 1988లో జయశ్రీ గోస్వామి మహంతను వివాహం చేసుకున్నారు. రైటర్‌ అయిన జయశ్రీ గోస్వామి.. ఆ తర్వాత రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు కూడా. అసెంబ్లీ సెక్రటేరియెట్‌ ఎంప్లాయి సంఘమిత్ర భరాలిని ఆయన రహస్యంగా రెండో వివాహం చేసుకున్నారన్న ఆరోపణలు వెంటాడుతూనే ఉన్నాయి. 1985 డిసెంబర్‌ నుంచి 1990 వరకు అస్సాం సీఎంగా విధులు నిర్వహించారు.

Hd Kumarswamy

హెచ్‌డీ కుమారస్వామి
1986లోనే కుమారస్వామికి వివాహం అయింది. ఆ తర్వాత 2006లో కన్నడ నటి రాధికను రహస్యంగా రెండో వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత రాధిక తనంతట తానుగా ప్రకటిస్తేనే విషయం బయటకు వచ్చింది. అప్పటికి ఆ విషయాన్ని అంగీకరించారు కుమారస్వామి. జేడీ(ఎస్‌) నేత హెచ్‌డీ కుమారస్వామి.. కర్ణాటక సీఎంగా 2006-07 మధ్య కాలంలో పని చేశారు.

VeerBadra SIngh

వీర్‌భద్ర సింగ్‌
1985లో ప్రతిభా సింగ్‌ను రెండో వివాహం చేసుకున్నారు వీర్‌భద్ర సింగ్‌. మొదటి భార్య రత్నకుమారి(జుబ్బల్‌ యువరాణి) అప్పటికే అనారోగ్యంతో మరణించారు. ప్రతిభా సింగ్‌ ఎవరో కాదు.. మండి లోక్‌ సభ ఎంపీ. హిమాచల్‌ ప్రదేశ్‌ రాజకీయాల్లో తిరుగులేని నేత వీర్‌భద్ర సింగ్‌. 1962, 1967, 1971లో.. మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1983లో వీర్‌భద్ర సింగ్‌.. హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రానికి తొలి సీఎంగా ప్రమాణం చేశారు. ఏడేళ్లపాటు సీఎంగా ఉన్నారు.

 

Chandra Mohan

చందర్‌ మోహన్‌
హర్యానా మాజీ ఉప ముఖ్యమంత్రి వివాహ జీవితం వివాదాస్పదంగా నిలిచింది. 2008లో మంత్రి పదవిలో ఉన్న సమయంలో ప్రేయసి అనురాధా బాలి కోసం మతం మార్చుకున్నాడు. భార్య సీమా భిష్ణోయ్‌ సమ్మతితోనే.. చాంద్‌ మొహమ్మద్‌, ఫిజా(అనురాధా బాలి)గా ఇద్దరూ పేర్లు మార్చుకుని మరీ వివాహం చేసుకున్నారు. ఈ వివాహం రాజకీయ ప్రస్థానాన్ని ఘోరంగా దెబ్బ తీసింది. ఆ తర్వాత కొన్నిరోజులకే ఇద్దరూ విడిపోగా.. 2012లో బాలి అనుమానాస్పద రీతిలో చనిపోయారు.

 

Babul SUpriyo

బాబుల్‌ సుప్రియో
2015లో మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న మాజీ కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో… 2019లో మోదీ కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా ఉండగానే ఎయిర్‌ హోస్టెస్‌ రచనా శర్మను రెండో వివాహం చేసుకున్నారు. ముంబై నుంచి కోల్‌కతా మధ్య ఫ్లైట్‌లో ప్రయాణించేప్పుడు వాళ్ల పరిచయం అయ్యింది.

Bhagawant Mann

పంజాబ్‌ సీఎం భగవంత్‌ మన్‌, డాక్టర్‌ గురుప్రీత్‌ కౌర్‌ వివాహం చండీగడ్‌లోని గురుద్వారాలో సిక్కు సంప్రదాయం ప్రకారం నిరాడంబరంగా రెండో పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్య ఇంద్రప్రీత్‌ కౌర్‌తో ఆరేళ్ల క్రితమే విడాకులు తీసుకున్నారు. 2022 మార్చిలో జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ క్లీన్‌ స్వీప్ చేయడంతో భగవంత్‌ సీఎం పగ్గాలను చేపట్టారు.

Cm Marriages