Cockroach Janata Party : ఇన్‌స్టాలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ సునామీ.. బీజేపీ కంటే ఎక్కువ ఫాలోయర్స్.. కాంగ్రెస్ కంటే..

Cockroach Janata Party : సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు వినిపిస్తోంది. అదే కాక్రోచ్ జనతా పార్టీ (CJP). ఈ సెటైరికల్ వెబ్‌సైట్‌ కొద్దిరోజుల్లోనే ‘బొద్దికల పార్టీ’గా భారతదేశంలోని సోషల్ మీడియాలో సంచలనాలు నమోదు చేస్తోంది.

Cockroach Janata Party

Cockroach Janata Party : సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు వినిపిస్తోంది. అదే కాక్రోచ్ జనతా పార్టీ (CJP). ఈ సెటైరికల్ వెబ్‌సైట్‌ కొద్దిరోజుల్లోనే ‘బొద్దికల పార్టీ’గా భారతదేశంలోని సోషల్ మీడియాలో సంచలనాలు నమోదు చేస్తోంది. అభిజిత్ దీపక్ అనే వ్యక్తి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు, కన్వీనర్ అని ఆ పార్టీ వెబ్‌సైట్ చూపుతోంది. అయితే, ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త సంచలనాలు నమోదు చేస్తుంది.

Also Read : Cockroach Janta Party : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’.. ఎవరీ అభిజీత్ దీప్కే.. అతను ఏం చెప్పాడంటే..

ఈ వ్యంగ్య ఆన్‌లైన్ పేజీ కేవలం నాలుగు రోజుల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 11.1 మిలియన్లకు చేరుకుంది. ట్విటర్, ఫేస్‌బుక్‌లోనూ తన హవాను కొనసాగిస్తోంది. దేశంలోని జాతీయ పార్టీలుగా అత్యధిక ఫాలోయింగ్ కలిగిఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈ కాక్రోచ్ జనతా పార్టీ గట్టి పోటీ ఇస్తుంది. ఇన్‌స్టా‌గ్రామ్‌లో భారతీయ జనతా పార్టీ (BJP) అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యనుసైతం ఇది దాటేయడం విశేషం.

ప్రస్తుతం దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విటర్ ఫాలోవర్ల సంఖ్యతో పోల్చిచూస్తే ఈ కాక్‌రోచ్ హవా ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా తెలిసిపోతుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్..
బీజేపీ : 8.7 మిలియన్లు
సీజేపీ : 11.1 మిలియన్లు
కాంగ్రెస్ : 13.3 మిలియన్లు

ట్విటర్‌లో ఫాలోవర్స్..
బీజేపీ : 23 మిలియన్లు
సీజేపీ : 193.6కే
కాంగ్రెస్ : 11.5 మిలియన్లు

ఫేస్‌బుక్‌లో ఫాలోవర్స్..
బీజేపీ : 18 మిలియన్లు
సీజేపీ : 9.5కే
కాంగ్రెస్ : 10 మిలియన్లు