భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో ఇండియన్ ఆర్మీకి చెందిన వ్యక్తి పాకిస్తాన్ కు దొరికితే ఇక ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది. ఊహించడమే కష్టంగా ఉంది కదా? అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న అభినందన్ ఇంకెలా ఉంటాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో రగిలి పోతున్న పాక్ కు ఇండియన్ వింగ్ పైలెట్ అభినందన్ దొరికాడు. ఇండియన్ భూ భాగంలోకి వచ్చిన పాకిస్తాన్ యుద్ద విమానం ఎఫ్ 16 ను తరిమి కొట్టి కూల్చేసిన తరువాత మిగ్ 21 బైసన్ విమానం అదే స్పీడ్ లో పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లి టెక్నికల్ కారణంతో కూలిపోయింది. విమానం కూలిపోతున్న సమయంలో అభినందన్ ప్యారచూట్ సాయంతో పాకిస్తాన్ నేలపై దిగారు.
ఈ క్రమంలో అభినందన్ కనిపించిన వెంటనే పిడి గుద్దులు గుద్దుతూ.. తన్నుతూ ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. మొదట సైనిక శిభిరంలో అభినందన్ ను బంధించి మాట్లాడించిన వీడియోను మాత్రమే విడుదల చేసింది పాకిస్తాన్. పాకిస్తాన్ ఆర్మీ విడుదల చేసిన అధికారిక వీడియోలో అభినందన్ కు గాయాలు అయినట్లు ఉంది. విమానం నుండి దూకిన సమయంలో ఆయనకు గాయాలు అయ్యి ఉంటాయని అంతా భావించారు. కాని ఎలాంటి గాయం లేకుండా కిందకు దిగిన అభినందన్ ను పాకిస్తాన్ లోని స్థానికులు, ఆర్మీ వాళ్లు విచక్షణ రహితంగా కొట్టినట్లు తాజాగా విడుదలైన వీడియో ద్వారా తెలుస్తుంది. అయితే ఈ వీడియోలు అన్నీ వచ్చిన క్రమంలో భారత్ అభినందన్ ను విడుదల చేయించేందుకు గట్టి ప్రయత్నాలు మొదలెట్టింది. అభినందన్ ను విడుదల చేస్తారా? లేదా? అంటూ భారత్ గట్టి వార్నింగ్ ఇస్తుంది.
పాకిస్తాన్ ఆర్మీ ఆధీనంలో ఉన్న అభినందన్ ను కాపాడాలంటూ కేంద్ర ప్రభుత్వంకు దేశ ప్రజలు కూడాపెద్దఎత్తున విజ్ఞప్తి చేస్తున్నారు. అభినందన్ క్షేమంగా ఇండియాకు తిరిగి రావాలంటూ ప్రార్ధనలు చేస్తున్నారు. దేశం మొత్తం అభినందన్ కు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తూ క్షేమాన్ని ఆకాంక్షిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అభినందన్ ను పాక్ చిత్రహింసలు పెట్టి వదిలేయవచ్చు అని సీనియర్ సైనిక అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం కూడా అభినందన్ ను వెంటనే విడుదల చేయాలంటూ పాకిస్తాన్ పై ఒత్తిడి తెస్తుంది.
అభినందన్ ను చంపే సాహసం మాత్రం పాకిస్తాన్ చేయదని, చంపేవారే అయితే అభినందన్ సజీవంగా ఉన్న వీడియోలను పాక్ ఆర్మీ విడుదల చేసేది కాదని భారత సైనిక అధికారులు చెప్తున్నారు. అభినందన్ సజీవంగా ఉన్న వీడియోను బయటకు విడుదల చేసిన పాకిస్తాన్ అభినందన్ ను చంపేస్తే మాత్రం అంతర్జాతీయంగా నిలపరాధి అవుతుంది.