Gujarat: వడోదరలో అల్లర్లు.. అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపై పెట్రోల్ బాంబులు

కొద్ది సమయానికి పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు వోడదల పోలీసులు తెలిపారు. పనిగేట్ ప్రాంతంలో గాలింపు చర్యలు, పెట్రోలింగ్ ముమ్మరం చేశామని పేర్కొన్నారు. ఘర్షణ తెలెత్తిన ప్రాంతంలోని సీసీటీవీలను పోలీసులు స్కానింగ్ చేస్తూ, దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు 19 మందిని అదుపులోనికి తీసుకున్నామని వడోదర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ యష్‌పాల్ జగనియా తెలిపారు.

Gujarat: దీపావళి రోజు గుజరాత్‌లోని వడోదరలో అల్లర్లు చెలరేగాయి. బాణసంచా కాల్చే విషయంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణలకు దారితీసింది. ఇది ఎంత వరకు వెళ్లిందంటే.. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లురువ్వుకుంటూ విధ్వంసానికి పాల్పడ్డారు. ఇంతటితో ఆగకుండా పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపై అల్లరిమూక పెట్రోల్ బాంబులు రువ్వే వరకు వెళ్లింది. కాగా, ఈ అల్లర్ల కారణంగా ఒక మైనర్ బాలుడు గాయపడ్డాడు. మంగళవారం అర్తరాత్రి 12:45 గంటల సమయంలో ఈ అల్లర్లు జరిగినట్లు తెలిసింది.

కొద్ది సమయానికి పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు వోడదల పోలీసులు తెలిపారు. పనిగేట్ ప్రాంతంలో గాలింపు చర్యలు, పెట్రోలింగ్ ముమ్మరం చేశామని పేర్కొన్నారు. ఘర్షణ తెలెత్తిన ప్రాంతంలోని సీసీటీవీలను పోలీసులు స్కానింగ్ చేస్తూ, దుండగులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు 19 మందిని అదుపులోనికి తీసుకున్నామని వడోదర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ యష్‌పాల్ జగనియా తెలిపారు.

ఘర్షణలు చెలరేగిన సుమారు ఒక గంట తర్వాత ఆ ప్రాంతంలోని మూడో అంతస్తు పైనుంచి ఒక వ్యక్తి పోలీసులపై పెట్రోల్ బాంబులు రువ్వినట్టు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. అల్లర్లు జరిగిన ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించినట్లు జగనియా పేర్కొన్నారు. ఈ నెల 3వ తేదీన వడోదరలో హిందూ, ముస్లిం సమూహాల మధ్య ఘర్షణ చెలరేగింది. సావ్లీ సమీపంలోని జెండాలు ఎగురవేయడం ఈ ఘర్షణకు తావు తీసింది. ఈ కేసులో 40 మంది అరెస్ట్ చేసి, విడుదల చేశారు.

AP High Court Recruitment : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ప్రాసెస్ సర్వర్ పోస్టుల భర్తీ

ట్రెండింగ్ వార్తలు