క్వారంటైన్ సెంటర్ నుంచి వెళ్తూ కండోమ్‌లతో బీహార్ వాసులు

  • Publish Date - June 2, 2020 / 02:05 PM IST

బీహార్‌లోని క్వారంటైన్ సెంటర్ల నుంచి ఇళ్లకు వెళ్తున్న వేల మంది మగాళ్లు, ఆడాళ్లు కరోనా రాకుండా మాస్క్ లు పట్టుకెళ్లడం కాదు. కండోమ్‌లు, గర్భస్రావం అవడానికి ట్యాబ్లెట్లు తీసుకెళ్తున్నారు. కరోనా వైరస్ లాక్‍‌డౌన్ ను అడ్డుకునేందుకు స్టేట్ హెల్త్ సొసైటీనే వీరికి పంచిబెడుతుందట. 2016 లెక్కల ప్రకారం.. ఇండియాలోనే ఫెర్టిలిటీ రేట్‌లో బీహార్ టాప్ పొజిషన్ లో ఉంది. 

వలస కార్మికులు ఇళ్లకు తిరిగి రావడం, మధ్యలో పండుగలు జరుగుతుండటం వంటి అంశాలు 9నెలల తర్వాత అత్యధిక సంఖ్యలో ప్రసవాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గతేడాది కూడా ఇదే పరిస్థితి. 

‘మేం కండోమ్‌లు, గర్భస్రావం అయ్యే ట్యాబ్లెట్లు పంచిబెడుతున్నాం. మార్చి నెలలో హోలీ, దీపావళి, ఛాట్ పండుగల సందర్భంగా వలస కార్మికులు  ఇళ్లకు వచ్చారు. సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత నవంబరులో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో డెలివరీలు నమోదయ్యాయి’ అని స్టేట్ హెల్త్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మనోజ్ కుమార్ అంటున్నారు. 

లాక్‌డౌన్ నియమాలు సడలించడంతో లక్షల్లో వలస కార్మికులు బీహార్ రాష్ట్రానికి చేరుకుంటున్నారు. ఢిల్లీ, ముంబై నగరాలకు మాదిరిగానే డబ్బు, ఆహారం తక్కువ మొత్తంలో దొరుకుతుండటంతో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది.