Bharat Jodo Yatra: రాహుల్ గాంధీకి భద్రతా లోపంపై అమిత్ షాకు లేఖ రాసిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

రాబోయే రెండు రోజ్లుల్లో ఈ యాత్రలో జనం పెద్ద సంఖ్యలో పాల్గొంటారని మేము అంచనా వేస్తున్నాం. శ్రీనగర్‌లో ఈనెల 30న భారీ సభ జరుపుబోతున్నాం. యాత్ర ముగింపు సందర్భంగా జరుపుతున్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఇతర రాజకీయ పార్టీల ముఖ్య నేతలు హాజరవుతున్నారు. మీరు వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని, యాత్ర ముగిసే వరకూ తగిన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరుతున్నాం

Bharat Jodo Yatra: జమ్మూ కశ్మీర్‭లో కొనసాగుతోన్న భారత్ జోడో యాత్రలో భద్రతా లోపాలు తలెత్తడం, ఆ కారణంగా శుక్రవారం యాత్ర నిలిపివేయాల్సి రావడంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. భారత్ జోడో యాత్ర సజావుగా సాగేందుకు తగినంత భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసేందుకు తగిన జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు. ఖాజిగుండ్‌లో రాహుల్ గాంధీ చుట్టూ ఉన్న భద్రతా సిబ్బందిని జమ్మూకశ్మీర్ పోలీసులు శుక్రవారం ఉహసంహరించడంతో యాత్రను సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఖర్గే లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది.

Hindenburg Report On ADANI Group: అదానీ గ్రూప్స్ సంక్షోభంపై స్పందించిన మాయావతి.. పార్లమెంటులో ప్రకటన కావాలని డిమాండ్

”రాబోయే రెండు రోజ్లుల్లో ఈ యాత్రలో జనం పెద్ద సంఖ్యలో పాల్గొంటారని మేము అంచనా వేస్తున్నాం. శ్రీనగర్‌లో ఈనెల 30న భారీ సభ జరుపుబోతున్నాం. యాత్ర ముగింపు సందర్భంగా జరుపుతున్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఇతర రాజకీయ పార్టీల ముఖ్య నేతలు హాజరవుతున్నారు. మీరు వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని, యాత్ర ముగిసే వరకూ తగిన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరుతున్నాం” అని అమిత్ షాకు రాసిన లేఖలో ఖర్గే కోరారు.

Bharat Jodo Yatra: కాశ్మీర్‌లో స్వచ్చమైన గాలిలా రాహుల్ యాత్ర.. భారత్ జోడోయాత్రలో మెహబూబా ముఫ్తీ..

రాహుల్ సారథ్యంలో కొనసాగుతోన్న భారత్ జోడో యాత్ర గత ఏడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమై 12 రాష్ట్రాల్లో పర్యటించి ఈనెల 30న శ్రీనగర్‌లో ముగియనుంది. మొత్తంగా 3,500 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపినట్లే కనిపిస్తోంది. అయితే, ఇది రాజకీయ యాత్ర కాదని, దేశంలో పెరుగుతున్న విద్వేషాల నుంచి ఐక్య భారతాన్ని సాధించేందుకు నిర్వహిస్తున్న యాత్ర అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు