Congress Hits back PM Modi: మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోదీ విమర్శలకు 1989ని గుర్తు చేస్తూ ప్రతిదాడి చేసిన కాంగ్రెస్

మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. అయితే కేంద్ర ప్రభుత్వం అంగీకరించినప్పటికీ 2029 లోపు ఈ బిల్లు అమలులోకి వచ్చే పరిస్థితి లేదు. 2029కి ముందు అమలు జరగదని స్వయంగా ప్రభుత్వమే చెప్పింది.

Congress Hits back PM Modi over Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది. 1989లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ.. అప్పుడు బీజేపీ వ్యతిరేకించడం వల్లే బిల్లు ఆగిపోయిందని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఇక ఈ విషయమై ఆ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరా మాట్లాడుతూ ప్రధాని మోదీని తమ స్టార్ క్యాంపెయినర్‌ అని అభివర్ణించడం విశేషం. అంటే కాంగ్రెస్ తీసుకువచ్చిన ఈ బిల్లుని మోదీ ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదింపజేసిందనే అర్థంలో ఆయన సెటైర్లు వేశారు.

‘‘మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకమని ఆయన చెబుతూనే ఉన్నారు. అయితే 1989లో రాజీవ్ గాంధీ రాజ్యసభలో ఈ బిల్లును ప్రతిపాదించిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఈ బిల్లును బీజేపీ నేతలు అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీ, జస్వంత్ సింగ్ వ్యతిరేకించారు. ఆ సమయంలోనే ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ నేతలు వ్యతిరేకించారు’’ అని పవన్ ఖేరా అన్నారు.

Pakistan: అయ్యయ్యో పాకిస్తాన్.. అత్యంత దయనీయంగా ఆర్థిక పరిస్థితి.. పొలం పనుల్లోకి జవాన్లు

అంతకుముందు కాంగ్రెస్ నేత అల్కా లాంబా స్పందిస్తూ.. మహిళా రిజర్వేషన్ అవసరమని, దీనికి కాంగ్రెస్ పార్టీ గట్టి మద్దతునిస్తుందని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. అయితే కేంద్ర ప్రభుత్వం అంగీకరించినప్పటికీ 2029 లోపు ఈ బిల్లు అమలులోకి వచ్చే పరిస్థితి లేదు. 2029కి ముందు అమలు జరగదని స్వయంగా ప్రభుత్వమే చెప్పింది. అందుకే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాన్ని పిలిచి చప్పట్లు కొట్టడం కోసమే అన్ని ఆడంబరాలు చేసిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.